Friday, July 15, 2016

బిల్లానదనెంతె కీసువం!


బిల్లానదనెంతె కీసువం!


సాహితీమిత్రులారా!

క్రీ.శ. 10వ శతాబ్దం నాటి
ఒక కన్నడ శాసనంలోని పద్యం ఇది
చూడండి
ఎంత చమత్కారంగావుందో!

ఎనిత్తెనిత్తంబుజపత్ర నేత్రయా
ఘనస్తనంగళ్ బళెగుం కిరాతెయా
అనిత్తనిత్తం వనదొళ్ వనచరం
బిల్లానదనెంతె కీసువం!

(ఇంటివద్ద) పద్మపత్రములవంటి నేత్రములుగలిగిన
కిరాత యువతి యొక్క ఘనస్తనములు పెరుగుతున్నకొలదీ,
అడవిలో వేటనిమిత్తం చరిస్తున్న (ఆమె భర్తయైన)
కిరాత యువకుడు విల్లును ఎక్కుపెట్టే శక్తి
తగ్గిపోతూ వస్తోంది! - అని భావం.

పాపం అతనికి ఆ శక్తి ఎందుకు తగ్గుతోందో?
అందులోని ధ్వని ఏమిటో?
వేరు చెప్పక్కరలేదనుకుంటాను.

3 comments:



  1. ప్రేమ కు లొంగని శక్తి గలదా !


    అంబుజ నేత్రి కుచోరుహ
    తాం భుజ బలశాలి మేని దార్డ్యమనంగన్
    శాంభుని శక్తి హరించెను
    శాంభవి కుచసంపదాతిశయము గొనంగన్

    జిలేబి

    ReplyDelete
  2. జిలేబిగారికి,
    ధన్యవాదాలు, మీ వ్యాఖ్య చాలా బాగుంది.

    ReplyDelete
  3. జిలేబిగారికి,
    ధన్యవాదాలు, మీ వ్యాఖ్య చాలా బాగుంది.

    ReplyDelete