Tuesday, July 12, 2016

చూతే జగతి ఫలరాజే ప్రసరతి


చూతే జగతి ఫలరాజే ప్రసరతి


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలో కవి ఎంత సహజంగా
చమత్కరించాడో!
చూడండి.

అభూచ్ఛామా జంబూ: దళితహృదయం దాడిమఫలం
సశూలం సంధత్తే హృదయ మవమానేన పనస
భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలిఫలం
సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి!

మామిడిపండు ఫలరాజంగా ప్రపంచంలో
ప్రఖ్యాతి పొందుతూంటే
నేరేడుపండు మొగం మాడ్చుకున్నది.
దానిమ్మపండుకు గుండె బ్రద్దలైంది.
పనసపండు గుండెలో గసిక(మొనదేలి
త్రవ్వటానికి అనువైన కొయ్య) గ్రుచ్చుకొంది.
కొబ్బరి ఫలము గుండె నీరైంది - అని భావం.
అన్ని పండ్లకు వాటి సహజ గుణాలతోనే
కవి ఎంతగా చమత్కరించాడో కదా!

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. మామిడి కేల గల్గెనిది మామిడి రాజయె పండ్లజాతులం
    దేమని చెప్పవచ్చుమరి నీగతి పట్టక బోయెవేటికిన్
    ఏమని వీడిరో సురలు యీగతి కంజమ తోడబుట్టినన్
    మామిడి భూమిపై నిటుల మానసు దోచెను మానవాళిదిన్

    ReplyDelete
  4. పండ్ల యందు మిన్న పండ్లవి మామిడి
    పీల్చ రసము దీ పి గల్గి యుండు
    గుంజు దినగ నుండు గంజమ వోలెను
    వాటి మించు పండ్లు వసుధ లేవు

    ReplyDelete