Saturday, January 7, 2017

నుతజల పూరితంబులగు నూతులు.......


నుతజల పూరితంబులగు నూతులు.......



సాహితీమిత్రులారా!



నన్నయ శ్రీమదాంధ్రమహాభారతము
ఆదిపర్వంలోని ఈ పద్యం చూడండి-

శకుంతల దుష్యంతునితో అన్న పద్యం ఇది-

నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావిమేలు మరి బావులు నూరిటికంటె నొక్క స
త్క్రతువది మేలు తత్క్రతుశతంబుకంటె సుతుండు మేలు త
త్సుతు శతకంబుకంటె నొక సూనృతవాక్యముమేలు చూడగన్
           (శ్రీమదాంధ్రమహాభారతము - ఆది - 4- 96)

సత్యవ్రతముకల ఓ రాజా!
మంచినీటితో నిండిన చేదుడు బావులనూరిటికంటె
ఒక దిగుడు బావి మేలు కాగా అలాంటి బావులు నూరిటికంటె
ఒక మంచి యజ్ఞము మేలు, అటువంటి నూరు యజ్ఞాలకంటె
ఒక కొడుకు మేలు, అలాంటి నూరుగురు కొడుకుల కంటె
ఒక సత్యవాక్యం మంచిది - అని భావం.

దీన్ని నన్నయగారు చంపకమాలలో వ్రాయగా
అనంతామాత్యులుగారు ఇదే భావంగల పద్యం
కందంలో ఎంత చక్కగా ఇమిడ్చారో చూడండి -

శతకూపాధికదీర్ఘిక
శతవాప్యధికంబు గ్రతువు శతయజ్ఞ సము
న్నతు డొక్క సుతుడు దత్సుత
శతకంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా!
                                                                    (భోజరాజీయము - 6-84)



23 comments:

  1. మాకు తెలియని భోజరాజీయము నందలి సత్యమహిమను తెలుపు కందపద్యమును తెలిపినందుకు అనేక ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఆనంతామాత్యులు నన్నయ పద్యాన్ని కాపీ కొట్టాడా?

    ReplyDelete
  3. శతకంబున .... అని ఉండాలండి. సరి చేయగలరు.
    లేకపోతే గణభంగం అవుతున్నది.

    ReplyDelete
    Replies
    1. అవునండి బాగా గుర్తించారు

      Delete
  4. https://www.blogger.com/profile/12121701681361463485

    శతంబునకంటె అని ..మహాకవి పద్యంలో వున్నది..
    శ్యామలీయం వారు శతకంబని..సవరణ చేయటం సముచితంకాదు.

    ReplyDelete
    Replies
    1. మహానుభావా, నేనేమీ అత్యుత్సాహం ప్రదర్శించ లేదండి.శతంబున కెక్కు డొక్క .. అని వ్రాసిన పక్షంలో కందపద్యపు ఛందస్సుకు గుణాలు సరిగా అమరవు. ఈ మాటను కూడా చెప్పాను. మీరు నేనేదో అనుచితంగా మాట్లాడానని అనటం అసందర్భంగా ఉంది. అనంతామాత్యుల వారికే కందపద్యం ఛందస్సు తెలియదని మీ ఉద్దేశమా? ఎంత పిచ్చి మాట. ఆయనను మీరు మహాకవి అన్నారు కదా, ఛందస్సు ఆయన ఎలా తప్పుతారూ?

      మీకు గుణాలు గురించీ, పద్య పాదాల గణవిభజన గురించీ తెలియక పోవచ్చు. అదటుంచి, నడకను బట్టే ఛందస్సు సరిగా లేకపోతే వెంటనే తెలిసిపోతుంది. మీరేమో ప్రోఫైల్ పేరులోనే సాహిత్యం అని జోడించారే, ఈమాత్రం కూడా మీకు తెలియక పోవటం వింతగా ఉంది.

      Delete
    2. Even though you are a person with great knowledge and a scholar , I feel thatvyouvtend to overreact to criticism sir.

      గాదిరాజు గారు చాలా గౌరవ పూర్వకంగా అభిప్రాయం చెప్పారు. మీరు తొందరపాటుతో ఎత్తి పొడిచారు. పండితులుగా మీకు అది శోభ నివ్వదు

      I request you to be more relaxed. I think you lack a sense of humour.

      I was only giving my feedback sir. Highest regard for you.

      Delete
    3. I think you lack a sense of humour.
      పండితులుగా మీకు అది శోభ నివ్వదు
      Well said sir. Unfortunately he will again take it in a negative manner and respond otherwise.
      He is no doubt well knowledged but unfortunately lacks ----- and always belittles others, in whatever way that is available. Tana stayi marichi epudu kindi stayi vallato gillikajjalaku vastaru ayna. Hope he understands in a right manner this time - atleast. With regards to all the parties in the comments section.

      Delete
    4. Both the above are correct. May be it's because of the truth from the saying "Tappulennuvaru Tama tappuledu garu".

      Delete


  5. శతకూపాధికదీర్ఘిక
    శతవాప్యధికంబు గ్రతువు శతయజ్ఞ సము
    న్నతు డొక్క సుతుడు దత్సుత
    శతంబునకు నెక్కు నొక్క సత్యోక్తి నృపా!

    ReplyDelete
    Replies
    1. రోజూ కందాలు గిలుకుతూ కాలక్షేపం చేస్తూ ఉండే జిలేబీ గారూ, మీకూ ఈపద్యంలో ముద్రారాక్షసం కనుపిచలేదా?

      Delete

    2. రాక్షసులను వెతికి వెతికి మేము పట్టమండి
      రామనామమెక్కడుందో అక్కడ మాత్రమే చూపు సారిస్తామండి :)


      జిలేబి

      Delete
    3. కం. వెదుకగ నేల జిలేబీ
      మదమత్తులు సంప్రదాయమార్గవిరోధుల్
      వెదకుచు వత్తురు వారే
      సదమలబుధ్ధులకు హాని జరుపగ నసురుల్

      Delete
    4. For once I liked jilebi reply to shyamal sir.

      Shyamal Rao Garu. Please be cool. Don't take everything to heart. శాంతము లేక సౌఖ్యము లేదు.

      Delete
    5. వెదకుచు వత్తురు
      Idekkadi rakshasatvam? Vetiki vetiki bokkalu choopettevaru surula? Idekkadi nyayam mahaprabho ane varu asurula? Pade pade itarula joliki velli idi adi tappu meeru tappu memu oppu anu varu sampradayabaddula? Ayina veeriki Zilebi jolikellalante hadals, itarulaite matram basti me saval, endukante varu Zilebi vale padyala guchaleru kada! Sarlendi maku ma devudunnadu, maku knowledge takuvaina ayane ma dikku.

      Delete
  6. నుతజల పూరితంబు.. అనే నన్నపార్యుని పద్యంలో కూడా ముద్రారాక్షసాలు దొర్లాయి. శతంబున కంటె అని మూడవ పాదం ముగించాలి. చివరి పాదంలో శతకంబు కంటె అని ఉండాలి. దయచేసి టపాలను సరిచూచుకొని ప్రకటించ ప్రార్ధన. లేకపోతే గాదిరాజు గారి వంటి వారు నన్నయ గారి పాఠం అలాగే ఉందని భావించే ప్రమాదం ఉంది.

    ReplyDelete
  7. శ్యామలీయంవారు బ్లాగులలో పొరపాట్లు సవరించటం ,సలహాలందించటం ఆనందదాయకం.
    అయితే సవరణలు తెలుపునపుడు ఫలానా మహాకవిగారి పద్యంలో ఫలానా పాదంలో అని విశదించటం ..పండితులధర్మం.
    అయినా...మహాకవుల పద్యాలలో ముద్రారాక్షసాల వలన పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే..మూలాలు సాహిత్యాభిమానులకు అందుబాటులో వుంటాయి.కాబట్టి ..

    బ్లాగర్ ..మహాకవుల రచనల వైశిష్ట్యాలను సాహితీప్రియులకు తెలియజేయాలని ప్రయత్నిస్తుంటే..అచ్చుతప్పులంటూ ..కోడిగ్రుడ్డుపై ఈకలు పీకటం లాంటి వ్యాఖ్యలు సాహిత్యప్రకాండులకు సముచితంకాదు.

    ఇక నా బ్లాగునకు సాహిత్యమును జోడించటం..సాహిత్యాభిమానిగా నా ఉత్సాహం..పెద్దలు నిరుత్సాహపరచరని నా ఆశ.

    ఇక అన్నీనాకు తెలుసుననే అహంకారం నాకు లేదు.నేను నిత్యవిద్యార్థిని.
    నా పోస్టింగులలో తప్పులలే వుండవనినేను..భావించటం లేదు.
    పెద్దల సూచనలు శిరోధార్యము.

    ReplyDelete
    Replies

    1. ఇంత పెద్ద యెత్తున మీరు శ్యామలీయం వార్ని‌ ఝాడిస్తే వారు పారి పోతారండి :) కొంత సన్నగా వాయించండి అప్పుడే టైం పాస్ బఠాణీలు లభ్యమౌతాయి :)



      నారదా!
      జిలేబి

      Delete
    2. Ekkadiki vaaru pariporulendi. Marala vachuta, marali vachuta vaariki abhyasamto abbina vidye. Varikado sarada. Ranu ranantune chinnado pata gurtuku ravadam leda? Meekardham avutonda Zilebi garu? టైం పాస్ బఠాణీలు :)

      Delete
    3. నేను నిత్యవిద్యార్థిని. Miru vidyardhiga untaniki ishtapadataru. Varu Guruvuga untaniki kashtapadataru. Adokkate teda.

      Delete
    4. పొరపాట్లు సవరించటం ఆనందదాయకం అంటారు. ఆ వెంటనే అచ్చుతప్పు లంటూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నా నంటారు. బాగుంది కదా?

      పారిపోవటం కాదండి జిలేబీ గారు. వ్యర్ధచర్చలను కొనసాగించారు కాదు కదా! అందుకని చాలిద్దాం అంటున్నాను. సరేనా?

      Delete
  8. కొనసాగించరాదు అన్నది పొరబాటుగా పడింది. మన్నించాలి..

    ReplyDelete
  9. సూనృత వాక్యము,సత్త్యోక్తి అర్థము చాలా విశాలమైనది.సత్య వాక్యము,మనసుకు హత్తుకునేలా చెప్పే మంచి మాట అనే అర్థం లో ప్రయోగమది.మంచి పద్యాన్ని గుర్తు చేసారు .

    ReplyDelete