Tuesday, January 10, 2017

మాలవాడెవరు?


మాలవాడెవరు?




సాహితీమిత్రులారా!


మన హిందూ సమాజంలో పూర్వంనుండి
మాలలని కొందరిని గ్రామాలలో దూరంగా
ఉంచటం జరిగుతూండేది - అంటరానితనం
కూడ పాటించేవారు - కాని నిజంగా మాలలెవరో
ఈ పద్యంలో కవి చెబుతున్నాడు చూడండి-

వలవని కాంతకై తిరుగు వాడొకమాల, ధనంబు కూడియున్
వలసిన వస్తువుల్గొననివాడు మాల, సభాస్థలంబులన్
వలసిన తప్పుల న్వెదకు వాడొక మాలడుగాక యూరికిన్
వెలుపల నిలుగట్టి నను వాడొక మాలడు గాడు పృథ్విలోన్

తన యందు ప్రేమలేని స్త్రీ కోసం,
కేవలం తను ప్రేమించానని వెంటబడి తిరిగే వాడు
 ఒక మాలవాడు.
కావసిన డబ్బుండికూడ అవసరమైన వస్తువులు
కొనకుండా ఉండేవాడు కూడ అటువంటివాడే
సభలకు వెళ్ళినప్పుడు ఎదుటి వారి
తప్పులు మాత్రం వెదికేవాడు మాలమాడు -
ఈ చెప్పిన చెడ్డలక్షణాలున్నవాణ్ణి మాల అని
తిరస్కరించాలి కాని,
కేవలం గ్రామానికి దూరంగా ఇల్లుకట్టుకొని
నివసించే వాణ్ణి మాల అని చెప్పకూడదు - అని భావం.


No comments:

Post a Comment