Thursday, January 12, 2017

కొడుకా! యెక్కడికేగితే (భావానుకరణ)


కొడుకా! యెక్కడికేగితే (భావానుకరణ)సాహితీమిత్రులారా!


శేషధర్మములపేరుతో చాల మంది కృతులు కూర్చారు.
వారిలో తామరపల్లి తిమ్మయాభిధానులు ఒకరు.
వీరి శేషధర్మము తృతీయాశ్వాసంలోని ఈ పద్యం చూడండి-

తనయా! నీనగుమోముఁజూపి మదిలో దైన్యంబు వోఁబెట్టి చ
క్కని నెయ్యంబున ముద్దు బల్కులు వినంగాఁ బల్కవే నిన్నుఁబా
సిన రత్నాభరణాంబరార్థ గజవాజిస్యందనాందోళికా 
ద్యనవద్య స్థితులేల? మందిరములేలా? నూఱువేలుండినన్?


దీనికి అల్లంరాజు సుబ్రమణ్యకవి
చెప్పిన పద్యం చూడండి-

కొడుకా!యెక్కడకేగితే! మొగమునాకుంజూపి డెందంబులో 
నడలుం బాపుమ! నిన్ను బాసిన మణుల్ హర్మ్యంబులున్ దోఁటలున్
గుడుముల్ శర్కరముల్ ధనంబులు నగల్ కోటానుకోట్లున్న నీ
నొడువుల్ వోలె మనోరథార్థవితతుల్ నూల్కొల్పలే వెవ్వియున్

చూచారుకదా పై పద్యానికి
దీనికి భావంలో తేడా ఏమైనా ఉందా!


No comments:

Post a Comment