Monday, January 9, 2017

ధన ప్రభావం ఎంత గొప్పదంటే.....


ధన ప్రభావం ఎంత గొప్పదంటే.....




సాహితీమిత్రులారా!

ధన ప్రభావాన్ని వర్ణించే
ఈ చమత్కారశ్లోకం చూడండి-

దుందుభిస్తు సుతరా మచేతన
స్తన్ముఖా దపి ధనం ధనం ధనమ్
ఇత్థమేవ వివదః ప్రవర్తతే
కింపున ర్యది జన స్సచేతనః
                                                        (సుభాషిత సంగ్రహః)


పూర్తిగా అచేతనమైన దుందుభి
అనే వాద్యాన్ని చేతితో తాకితే
ధనంధనం - అని ధ్వనిస్తుందికదా!
అచేతనమైన దానికే ధనంమీద అంత
వ్యామోహముండగా చైతన్యంకల మనుష్యుల
కుంటుందని వేరు చెప్పవలెనా! - అని భావం


ధన్ ధన్ అని దుందుభి ధ్వనిని
అనుకరిస్తూ చెప్పిన శ్లోకం ఇది.

No comments:

Post a Comment