Tuesday, January 3, 2017

వీడు నాకొడుకా?


వీడు నాకొడుకా?



సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి-
ఎవరిమీదైనా కోపం వచ్చినపుడు
గాడిదకొడకా -అని తిట్టడం
ఒక అలవాటు కదా!
దీన్నే ఒక కవి ఈ పద్యంలో
ఎలా చమత్కరించాడో చూడండి-

ఆడిన మాటలు దప్పిన
గాడిద కొడుకంచు దిట్టగా విని యయ్యో
వీడా నాకొక కొడుకని
గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!

ఆడిన మాట తప్పినవాణ్ని,
అబద్దాలు చెప్పేవాణ్ని,
గాడిద కొడుకా  - అని తిట్టినపుడు
ఆ తిట్టును గాడిద విని,
అయ్యో !ఛీ! ఇటు ఆడితప్పేవాడు
నా కొడుకా? ఎంత అవమానం - అని సిగ్గుతో
బాధపడిందట.
అంటే ఆడినమాట తప్పేవాడు గాడిదకంటే
అధముడని చెప్పడం కవి భావన.

1 comment:

  1. భలే చాటువు. ఎవరండీ ఇది చెప్పినది!

    ReplyDelete