Sunday, January 1, 2017

దుర్వారోద్యమ బాహువిక్రమ


దుర్వారోద్యమ బాహువిక్రమ 



సాహితీమిత్రులారా!


మనకు నచ్చినదాన్ని పదేపదే చదువుతాము.
చూస్తాము. కవి ఆ పద్యాలను మళ్ళీ రాస్తాడు.
అలా మళ్ళీమళ్ళీ వాడిన పద్యాలు తిక్కన
భారతంలో రెండున్నాయి. అవి -
   కథాసందర్భానుకూలంగా చెప్పిన పద్యాన్నే
   మళ్ళీ చెప్పడం అంటే అదీ ఒక అక్షరంకూడ
   మారకుండా అంటే  అది ఎలాంటి పద్యమై ఉండాలో కదా

విరాటపర్వంలో తిక్కన ఒక పద్యాన్ని ఇలాగే వాడాడు
ఆ పద్యం ద్రౌపది మాలిని(సైరంధ్రి)గా ఉండగా కీచకుడు
తనను ఇబ్బంది పెట్టిన సమయంలో ద్రౌపది కీచకుని
హెచ్చరింటానికి చెప్పిన పద్యం-

దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతి వీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకడతు లేవురు నిను దోర్లీలన్ వెసంగట్టి గం
ధర్వుల్ మానము బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయింగీచకా
                           (విరాట - 2- 172)

ఇదే పద్యాన్ని కీచకుణ్ణి ఇలా హెచ్చరించానని భీమునికి
మళ్ళీ చెప్పించాడు.

అలాగే విరాటపర్వంలోని (4-234) ఈ క్రింది పద్యం

గోగ్రహణంవేళ ఎవరూలేక ఉత్తరుడు బృహన్నలను సారథిగా
చేసుకొని యుద్ధానికి వెళ్ళి అక్కడ సైన్యాన్ని చూచి బెదరిపోతాడు
బృహన్నల ధైర్యం చెప్పి అర్జునుని ధనుర్బాణాలను తీసుకొని
యుద్ధానికి వెళతాడు వెళ్ళే సందర్భంలో శంఖారం విని
ద్రోణుడు ఈ పద్యాన్ని చెబుతాడు-

వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు రా
లచ్చికినై పెంపెరుంగిన బలంబులు రెండు గెల్వనేర్తునే?
హెచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా
కిచ్చదలంచి యొక్క మెయినిత్తఱిఁ బొందగు చేత యుందగున్
                              (విరాటపపర్వం 4-234)

ఈ పద్యం  ఉద్యోగపర్వం(3-84)లో మళ్ళీ  వాడుకున్నారు.

ఇదొక వింత సరదా కాబోలు-

No comments:

Post a Comment