ఎదిగిన ఆడవాళ్ళు మీరు
సాహితీమిత్రులారా!
ఆడవాళ్లను గురించి
రసరాజుగారి గజల్ చూడండి-
అమ్మల్లారా! ఎదిగిన ఆడవాళ్ళు మీరు.
ఆలోచిస్తే "సబల"కు ఆనవాళ్ళు మీరు
ఆర్ధ్రతలో అమ్మతనం అతివలకే సొంతం.
ఆగ్రహమే ఉరిమిందా! అగ్గిరాళ్ళు మీరు.
ఆడవారి ఆస్తికదా మాటకారితనం
యమరాజునె బోల్తా కొట్టించినోళ్ళు మీరు.
పడకగదిని పండించే తాంబూలం మగువ.
పట్టుతప్పితే- పతినే తన్నినోళ్ళు మీరు.
పూజలలో, నోములలో మహిళలదే పైచేయి.
పొడిచే సూర్యుణ్ణికూడ ఆపినోళ్ళు మీరు.
కాలాలకు వికారాలు కలగవచ్చునేమో.
కావ్యకాంతలై వెలిగిన చక్కనోళ్ళు మీరు.
అవకాశం వచ్చిందా- హద్దులేదు భామలకు.
అంతరిక్ష హృదయాన్నే తాకినోళ్ళు మీరు.
రంగవల్లి వాకిలిలో అంగనలే గొబ్బెమ్మలు.
రసరాజుకు గజలవుతూ బ్రతికినోళ్ళు మీరు
No comments:
Post a Comment