Friday, January 13, 2017

నేను చెడ్డవాణ్ణికాదుకదా?


నేను చెడ్డవాణ్ణికాదుకదా?





సాహితీమిత్రులారా!


ఆర్యాద్వాషష్టికలోని ఈ శ్లోకం చూడండి-
ఎవరైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే
మనగురించి ఎవరైనా ఏదైనా అన్నపుడు
అది నిజమేనా కాదా అని ఒకపరి ఆలోచించడం
తప్పుకాదుకదా!  -
అదే ఈ శ్లోకం వివరిస్తూంది చూడండి-

ఆక్రుష్టేన మతిమతా తత్వార్థ విచారణే మతిః కార్యా
యది సత్యం కః కోపః స్యాదనృతం ను కోపేన

"నువ్వు ఇల్లాంటివాడివి - అలాంటివాడివి" -
అని ఎవరైనా తిట్టినపుడు బుద్ధిమంతుడు
ఒకమాటు యదార్థస్థితిని గూర్చి ఆలోచించుకోవాలి.
అతడు అన్నది నిజమే అయితే
నాకు కోపం ఎందుకురావాలి?
అతడు నిజమే చెబుతున్నాడు కదా!
నిజం కాకపోతే కోపం ఎందుకు?
అతడన్నట్లుగా నేను చెడ్డవాడిని కాదుకదా! -
అని శ్లోక భావం.

నేటి కాలంలో ఇలా ఆలోచించేవారున్నారా?
ఏమో ఎవరివిషయం వారికే తెలియాలి.

No comments:

Post a Comment