Friday, January 6, 2017

నువ్వు చంద్రునితో ఏవిధంగా సమానం?


నువ్వు చంద్రునితో ఏవిధంగా సమానం?
సాహితీమిత్రులారా!

శివుని పూజలో ఉమ్మెత్త పువ్వును వాడటాన్ని
ఆధారంగా చేసుకొని
ఒకకవి ఈ విధంగా అంటున్నారు-

వారక యూశ్వరుండు తలపై ధరియించిన యంతమాత్ర న
వ్వారిజ వైరితోడ సరివత్తువె యుమ్మెతపూవ నీ పసన్
వారిధుసుబ్బునో, దెసలు వన్నెలు దేరునొ చంద్రకాంతముల్
నీరవునో, చకోరముల నెవ్వగదీరునొ, తాపమారునో

ఓ ఉమ్మెత్త పుష్పమా!
శివుడు చంద్రునివలె
నిన్నుకూడ తలపై ధరిస్తున్నాడు.
అంతమాత్రాన నీవు చంద్రునితో సమానుణ్నని
గర్వపడవద్దు. ఎందుకంటే,
నిన్ను చూచి సముద్రం పొంగదు.
దిక్కులలో నీవు కాంతులు వెదజల్లలేవు.
నీవల్ల చంద్రకాంత
శిలలు కరుగవు. తాపం చల్లారదు.
చంద్రుని వల్లనే
ఈ పనులన్నీ జరుగుతాయి.
అందువల్ల శివుని తలపై చేరటం ఒక్కటే
నిన్ను చంద్రునితో సమానంగా చేయలేదు.
ఇతర యోగ్యతలు నీదగ్గర లేవుకదా!- అని కవిభావం

No comments:

Post a Comment