Sunday, January 1, 2017

నూత్నవత్సరమేమీయు మనకు?


నూత్నవత్సరమేమీయు మనకు?




సాహితీమిత్రులారా!

శ్రీ అలంకారం కోటంరాజు గారి
నూతన సంవత్సర పరామర్శ పద్యాలు చూడండి-

అవని రూపెత్తినట్టి మహార్తి గనున.         
కట్నములగోడు చెవిజేర్చి కలత పడున.          
పేద నిట్టూర్పులను వినిపించు కొనున    
నూతనాబ్ధమ్ము ధాత్రిచేయూత యిడున.         

కుడుము చేతికి నిడిన లోగడ గలట్టి.        
బాధలను వీడి యదె పెద్ద పండువనెడి.     
సేవకావృత్తి సల్పెడి జీవనులకు.                   
ధాత్రి మోదంబె? నూతనాబ్దమ్ము నందు              

అద్దెకొంపల యజమాని గద్దరింపు.         
అగ్రవర్ణాల వికటాట్టహాస రవము                     
కల్ల తెరచాటు భాగోత మల్లనల్ల.                 
మాయు శుభవేళ యేది? సామాన్యునకును      

ఈ నిరుద్యోగ భూత సంప్రీతి కొరకు.     
ఆత్మబలిదాన మొనరించు నట్టి వారి.        
ఆదుకొని దారి జూపెడి అయ్యలెవరొ!          
ధరను జూపునె ? నూతనాబ్దమ్ము సుమ్ము.         

ఎట్లుషస్సులు వచ్చు చీకట్లు తప్ప?          
శైశిరమెగాని యెట్లు వాసంత మొదవు ?        
జ్యేష్ఠయే గాని యిందిర యేది కనగ?               
నూతనాబ్దమ్ము పెరటిలో నేతిబీర!    

పద్యము అందించినది-
అలంకారం విజయకుమార్

No comments:

Post a Comment