బలవంతంగా వశం చేసుకోదలిస్తే?
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చూడండి-
ఎంత నగ్నసత్యాన్ని చెబుతోందో-
కవితా వనితా చైవ స్వయమేవాగతా వరా
బలా దాకృష్యమాణాసా సరసా విరసా భవేత్
కవిత్వం కాని, వనితకాని తమంత
వలచి పురుషుణ్ణి చేరితేనే
అది శ్రేష్ఠంగా ఉంటుంది.
అలాకాక బలవంతంగా వశం
చేసుకోదలిస్తే ఫలితం వికటిస్తుంది-
అని భావం
కవితా ధోరణి సహజంగా తనంతట
తాను ఎవరినైనా చేరుతుంది.
అతని పాండిత్యం, అభ్యాసం
సహకరించి మంచి కవిత్వాన్ని
అందిస్తాయి. సహజంగా ఉండే
శక్తినే మన అలంకారికులు ప్రతిభ
అంటారు. అది లేనిది వ్యుత్పత్తి,
అభ్యాసాలు ఎన్నున్నా మంచి కవిత్వం
పుట్టదు. ఎంత పండితులైనా
గొప్పకవులు కారుకదా
No comments:
Post a Comment