Monday, January 2, 2017

కూర్చున్న స్థానం బట్టి గౌరమముంటుందా?


కూర్చున్న స్థానం బట్టి గౌరమముంటుందా?




సాహితీమిత్రులారా!



మారద వెంకయ్యగారి భాస్కర శతకంలోని
ఈ పద్యం చూడండి-

పండితులైనవారు దిగువం దగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొనకొమ్మన నుండగ క్రింద గండభే
రుండమదేభసింహనికురుంబులుండవె చేరి భాస్కరా!

వృక్షము క్రింది భాగంలో గండభేరుండ పక్షులు మొదలైన
జంతువులుండగా చెట్టు కొమ్మల చివర్లో కొతి ఒకటుంటే
ఆ జంతువులకు లోపము ఇసుంతైనా లేనట్లే విద్యాంసులంతా
నేల మీద కూర్చొని ఉంటే అల్పుడైన వాడు పీఠంపైన
కూర్చున్నంతమాత్రాన ఆ విద్వాంసుకేమి కొరత వాటిల్లుతుంది.
కావున పై కుర్చీలో అల్పుడు ఎక్కినంత మాత్రాన క్రింద ఉన్నవారి
మర్యాకుగాని గౌరవానికి గాని ఏ భంగం వాటిల్లదని
మారద వెంకయ్యగారి భావన అది నిజం కాదంటారా!



No comments:

Post a Comment