Wednesday, January 11, 2017

పామరుడే నిశ్చింతగా జీవింపగలడు


పామరుడే నిశ్చింతగా జీవింపగలడు




సాహితీమిత్రులారా!


లోకం తీరును వివరించే
ఈ శ్లోకం చూడండి -

సన్తః పచ్చరితోదయవ్యసనినః ప్రాదుర్భవ ద్యంత్రణాః
సర్వత్రైవ జనాపవాద చకితా జీవన్తి దుఃఖం సదా
అవ్యుత్పన్న మతిః కృతేన న సతా నైవా సతా వ్యాకులః
యుక్తాయుక్తవివేకశూన్యహృదయో ధన్యోజనః ప్రకృతః

లోకంలో బాధలు, విచారాలు అన్నీ మంచివారికే,
సత్ప్రవర్తనతో జీవించాలనుకునే వారికి ఎన్నో
కష్టాలు, కట్టుబాట్లు, జనులేమంటారో?
చెడ్డపేరు వస్తుందో ఏమో? అని అడుగడుగునా
భయపడుతూ దుఃఖంతో జీవితం గడుపుతారు
ఇక ప్రాకృత మనుష్యుడు పరిణత బుద్ధి
కలవాడు కాడు కాబట్టి తాను చేసిన మంచి
పనికి గాని చెడ్డ పనికి గాని ఏమాత్రం కలత చెందడు.
ఎందుకంటే వానికి ఏది యుక్తమో?, ఏది అనుక్తమో?
తెలుసుకునే మనశ్శక్తి లేదుకదా అందువలన వివేకవంతుని
కంటె పామరుడే నిశ్చింతగా జీవనం గడుపుగలడు
కనుక అతడే ధన్యుడు - అని భావం.

No comments:

Post a Comment