Monday, January 2, 2017

శివుడు కొండపై పడుకొనేది ఎందుకంటావు?


శివుడు కొండపై పడుకొనేది ఎందుకంటావు?




సాహితీమిత్రులారా!


ఈ చమత్కార పద్యం చూడండి-

శివుడద్రిపై శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరతమును శేషునిపై
పవళించుట నల్లి బాధ పడలేక సుమా!

శివుడు కైలాసపర్వతంపై పడుకోవడం
సూర్యచంద్రులు ఆకాశంలో ఉండటం
విష్ణువు పాముపైనుండి దిగకుండా
పడుకోనుండడం ఎందుకంటే
నల్లి బాధ పడలేకట
కవి నల్లి బాధను ఎంతగా భరించారో
అది ఇంత చమత్కారంగా చెప్పాడు.
ఇప్పుడు దాదాపు నల్లు అంతరించాయని
అనుకుంటాను అందుకే కొందరికి నల్లి అంటే
ఏమిటో తెలియడంలేదు. మంచిదే
కవిగారు చెప్పినట్లు కాకుండా శివుడు సూర్యచంద్రులు
విష్ణువు పడుకోవడానికి వేరేమైన ప్రత్యామ్నాయం
దొరకవచ్చు.

No comments:

Post a Comment