Friday, January 13, 2017

శ్రీకృష్ణదేవరాయల వద్దకు లక్ష్మిదేవి ఎందుకు చేరిందంటే.........


శ్రీకృష్ణదేవరాయల వద్దకు లక్ష్మిదేవి ఎందుకు చేరిందంటే.........




సాహితీమిత్రులారా!


ఈ చమత్కార పద్యాన్ని చూడండి-
కవి ఎంత చమత్కారో తెలుస్తుంది.

పెనిమిటి చేయు పుణ్యజనపీడన వృత్తి యు దండ్రి భంగమున్
దనయు ననంగభావమును దమ్ముని కార్శ్యము జూచి రోసి స
జ్జనపరక్షు శౌర్యనిధిఁజారు శరీరుఁ గళా ప్రపూర్ణు న 
వ్వననిధికన్య చేరె జితవైరి నికాయుని కృష్ణరాయనిన్

ఈ పద్యం కృష్ణదేవరాయలవారిని
ఒక కవి పొగడుతూ చెప్పిన పద్యం-

లక్ష్మీదేవి తన భర్త, తండ్రి, కుమారుడు,
సోదరుడు అనే వారిలోపాలను చూచి
విసుగెత్తి వారిని వదలి కృష్ణదేవరాయలను
ఆశ్రయించిందట - ఎందుకంటే
తన భర్త పుణ్యజన పీడన చేసేవాడు.
మరి తండ్రో శ్రీరాముని కోపానికి గురై
భంగపడినవాడు
 అది ఆమెకు బాధ కలిగించింది.
ఇక కుమారుడంటారా!
ఏకంగా శివుని కంటి మంటకు శరీరాన్ని
భస్మంచేసుకున్నవాడు
ఇది కూడ చింతకు కారణమేకదా!
మరి సోదరుడు చంద్రుడో కృష్ణపక్షంలో
కృశించి కనిపించకుండా పోతాడు.
అందుకే వారిని వదలి,
పుణ్యజనులను పీడించనివాడు,
ఎవరిచేతిలోనూ భంగపడనివాడూ,
సౌందర్యశోభితమైన ఆకారం కలవాడూ,
క్షీణించని కళలు కలవాడూ
కాబట్టి కృష్ణదేవరాల వద్దకు లక్ష్మిదేవి  చేరి
నివాసం ఏర్పరచుకొన్నదట - అని భావం.


(పుణ్యజనులుఅంటే రాక్షసులు)

No comments:

Post a Comment