కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల
సాహితీమిత్రులారా!
పతాకం ప్రతి ఒక్కరికి వారి ప్రత్యేకతను చెబుతుంది.
అది దేశం కావచ్చు దేవతా కావచ్చు.
మనకు భారతం విరాటపర్వంలో ఉత్తరగోగ్రహణంలో
బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరునికి కౌరవులను
పతాకాలగుర్తులతో పరిచయం చేస్తాడు. ఆ పద్యంలోని
వివరాలను పద్యం చూసిన తర్వాత చూద్దాం-
కాంచనమయవేదికా కనత్కేతనో
జ్వల విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభోభాగకే
తు ఫ్రేంఖనమువాఁడు ద్రోణసుతుఁడు
కనకగోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట
ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుడు
లలితకంబు ప్రభాకలిత పతాకావి
హారంబువాఁడు రాధాత్మజుండు
మణిమయోరుగ రుచిజాల మహితమైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘనతాళ తరువగు సిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచుకొనుము
(విరాటపర్వము -5-4)
ఈ పద్యంలో ప్రముఖులైన
ఆరుగురిని పరిచయం చేశాడు అర్జునుడు.
మొదట ద్రోణాచార్యనితో మొదలుపెట్టి
చివర భీష్మాచార్యునితో ముగించాడు.
ద్రోణుడు - స్వర్ణవేదికా ధ్వజము
అశ్వత్థామ - సింహలాంగూలధ్వజము
(లాంగూలము - తోక)
కృపాచార్యుడు- బంగారు ఆబోతు ధ్వజము
కర్ణుడు - రెండు ఏనుగులమధ్య ఉన్న శంఖ ధ్వజము
దుర్యోధనుడు- నాగధ్వజము
భీష్ముడు - ఐదు తాళవృక్షాల ధ్వజము
అని ఉత్తరునికి అర్జునుడు చూపుతాడు.
దేవతలు వారి ధ్వజచిహ్నములు
విష్ణువు గరుడధ్వజము
లక్ష్మిదేవి గుడ్లగూబ
శివుడు వృషభం
వినాయకుడు మూషికము
కుమారస్వామి కుక్కటము(కోడి)
మన్మథుడు చేప/మొసలి
బ్రహ్మ హంస
సరస్వతి హంస
పార్వతి సింహం
అష్టదిక్పాలకులు-
ఇంద్రుడు ఐరావతం
అగ్ని గొర్రె/మేక
యముడు మహిషం
నిఋతి ప్రేతం
వరుణుడు మొసలి
వాయువు లేడి
కుబేరుడు మనిషి
శివుడు వృషభం
నవగ్రహాలు-
సూర్యుడు సింహం
చంద్రుడు కుందేలు/లేడి
కుజుడు కోతి
బుధుడు కోడి
బృహస్పతి కృష్ణసారమనే లేడి
శుక్రుడు గవయమనే మృగం
శని కాకి
రాహువు నెమలి
కేతువు గ్రద్ద
ఇతరదేవతలు-
భైరవుడు శునకము
శీతలాదేవి గార్దభము(గాడిద)
గంగాదేవి మకరము(మొసలి)
యమున కూర్మము(తాబేలు)
Thank you for sharing the poem!
ReplyDelete