Tuesday, December 6, 2016

ఏవో ఏవో బాధలు భరించే మూగజీవితం


ఏవో ఏవో బాధలు భరించే మూగజీవితం



సాహితీమిత్రులారా!


తెలుగు గజళ్ళలో సినారె వారి
ఈ గజల్ చూడండి-

ఏవో ఏవో బాధలు భరించే మూగజీవితం
ఎన్నో ఎన్నో గీతలు ధరించె తెల్లకాగితం

సుతకోటి హితకోటి వున్నా గతవైభవం చాటుతున్నా
ఎంతో ఎంతో వేదన భరించె మాతృభారతం

చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా
ఔను ఔను లోకమే అనంత శోకపూరితం

పొరలేని తత్వార్థమున్నా భువిలోని వృత్తాంతమైనా
ఐనా ఐనా కావ్యమే అనూన కల్పనామృతం

ఇది వాపు - అనుకోకు బలుపు ఇది ఊపు - రాలేదు మలుపు
అంతే అంతే సంఘమే అనాది వ్యాధి పీడితం

తనగొంతు తడి ఆరుతున్నా మునుముందు ఏ కొండలున్నా
ఏరై పారే జాతికే సినారె గీతి అంకితం

(సినారె - తెలుగు గజళ్ళనుండి) 

No comments:

Post a Comment