Wednesday, December 7, 2016

మోకులతో కట్టి ఉంచినా ఉండనిది


మోకులతో కట్టి ఉంచినా ఉండనిది




సాహితీమిత్రులారా!



ప్రపంచంలో అన్నిటి కంటె వింతైనది ధనం లేదా లక్ష్మి
అతి చంచలమైనది. ఒక్కచోట కుదురుగా ఉండదుకదా!

ఈ శ్లోకం చూడండి-
లక్ష్మి లీలావిలాసం.

మధేయ మనార్యా, లబ్దాపి ఖలు దు:ఖేన
పరిపాల్యతే, దృఢ గుణ పాశ సంధాన
నిష్పంది కృతావినశ్యతి, ఉద్దామదర్ప
భట సహస్రోల్లాసిలతా పంజర
విద్ధృతాపి అపక్రామతి, మదజల
దుర్దినాంకార గజ ఘటిత ఘన ఘటాటోప
పరిపాలితాపి ప్రపలాయతే


ఈ లక్ష్మీదేవి ఉందే.......
ఈ దేవత అంత త్వరగా ప్రసన్నం కాదు.
ఒక వేళ ప్రసన్నమైనా ఎంతోకాలం దక్కదు.
మహాచంచలమైనది.
మోకులతో కట్టి ఉంచినా,
కత్తులబోనులో బంధించినా,
మదపుటేనుగులను కాపలాగా
ఉంచినా సరే - పారిపోతుంది.
అనార్యులకు - మూర్ఖులకు సైతం
ఒక్కోసారి సంప్రాప్తిస్తుంది.

No comments:

Post a Comment