Tuesday, December 27, 2016

వాణి నా రాణి


వాణి నా రాణి




సాహితీమిత్రులారా!


సరస్వతీపుత్రులమని చెప్పుకొనేవారే అందరూ.
వాణి నా రాణి - అని చెప్పగల సాహసం ఎవరికుంటుంది?
అలాంటి వాడు మన తెలుగులో ఒకడున్నాడట.
ఆయనే పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు.
ఈయన జైమిని భారతాన్ని పద్యకావ్యంగా రచించినవాడు.
శృంగార శాకుంతలం పేరున కాళిదాసు నాటం అభిజ్ఞాన శాకుంతలాన్ని
పద్యకావ్యంగా మలిచాడు.
ఈయన మీద ఒక చాటువుంది.
ఎవరు చెప్పరో గాని ఇది ప్రసిద్ధమైనది.
ఆ పద్యం -

పిల్లలమఱి పినవీరన
కిల్లాలట వాణి యట్టులే కాకున్నన్
తెల్లముగ నొక్కరాతిరి
తెల్లగ తెలవారు వరకు తేగలడె కృతిన్

ఒక్క రాత్రిలో పినవీరభద్రునికి బదులుగా
వాణియే జైమినీ భారతాన్ని రచించిదని
చిరకాలంగా పండితలోకంలో ప్రచారంలో ఉంది.
సరస్వతి ఆయనకు విధేయురాలుగా ఉండేదని
అలా కాకపోతే  పినవీరభద్రునికి అది సాధ్యమయేదా?
-అని పై పద్యంలో చెప్పబడింది.

విచిత్రమేమంటే ఈ విషయం
ఆయన తన కావ్యాలలో ఎక్కడా వ్రాయలేదు -
తరువాతి కవులు ఈ కవిమీది గౌరవంతో ఆవిధంగా
కల్పించారని కొందరివాదన.

3 comments:

  1. ‘వాణి నా రాణి’ గురించి మరింత సమాచారము తెలియచేయ వలసినది గ కోరుచున్నాము
    ఎందుకంటే మేము రాణీ వారివంశస్తులు

    ReplyDelete
  2. Vani విల్లాసం :తిమ్మాన

    ReplyDelete