మీరలీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్
సాహితీమిత్రులారా!
సారంగుతమ్మయ్య కృత
వైజయంతీవిలాసము
పన్నిద్దరు ఆళ్వారులలో
తొండరడిప్పొడి
(భక్తాంఘ్రిరేణువు)గా పిలువబడే
7వ ఆళ్వారు విప్రనారాయణుని కథ
తెలుపుతుంది.
విప్రనారాయణుడు క్రీ.పూ. రమారమి 3000
సంసత్సరముల క్రిందటివాడని ద్రవిడ
గ్రంథాలలోనిమాట. కాని ఈ కాలనిర్ణయం
చాలా విధాలుగా చెప్పుకొనుచు ఇతిహాసకులు
క్రీ.శ.7వ శతాబ్దంగా నిర్ణయించారు.
రంగనాథుని గుడిలో బంగారు పాత్ర దొంగిలించబడింది.
ఆ నేరం విప్రనారాయణునిపై మోపబడింది. ఆ సమయంలో
ఇతర మతాలవారు ఎత్తి పొడుపుగా అన్నమాటలు
సారంగు తమ్మయ్య ఈ విధంగా పద్యరూపం కల్పించాడు
చూడండి-
చోరుఁ డనంగరా దొరుల సొమ్ములు మ్రుచ్చిలినం బ్రసన్నునిన్
జారుఁ డనంగరా దు వెలుచం బరకాంతల గూడ, వీ డనా
చారుఁ డనంగ గూడ దనిశంబును వేశ్యలతో రమించినన్
బోరన మీరలీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్
(వైజయంతీ విలాసము - 4-101)
ప్రసన్నుడు(విష్ణువును నమ్ముకున్న
వారిని ప్రసన్నులంటారు)
ఇతరుల సొమ్మును దొంగిలించినా
దొంగ అని అనకూడదు,
అతడు పరస్త్రీలతో సంబంధం
పెట్టుకున్నా జారుడు అని అనకూడదు,
భోగం వారితో సంపర్కం కలిగి ఉన్నా
అనాచారుడని అనకూడదు,
ఓ వైష్ణవులారా! మీరంతా ఇతనికి గొప్పగా
బ్రహ్మరథం పట్టి సత్కరించండి - అని పద్యభావం.
దొరికినపుడే కదా! ఇవ్వాల్సినవి ఇచ్చేది.
ఇది కూడ అదే-
No comments:
Post a Comment