శ,ష -లను పలకలేనివారిని మందలించిన భట్టి
సాహితీమిత్రులారా!
భట్టీ రావణవధలో శ, ష - లను పలకలేనివారిని
ఈ విధంగా మందలించాడు చూడండి-
యద్యపి బహునాధీతే తధాపి పఠపుత్ర వ్యాకరణం
స్వజన: శ్వ జనోమాభూత్ సకలం శకలం సకృత్ శకృత్
ఆ విదిత శషస విశేషా వాణి, వక్త్రాద్వినిర్గతా యేషామ్
గుదవదన వివర భేదోరదనై రేవోపలక్ష్యతే తేషామ్
నాయనా! నీవు ఎక్కువ శాస్త్రాలు చదవకపోయినా సరేగాని,
వ్యాకరణం మాత్రం తప్పక చదువు. లేకుంటే నీనోట స్వజనం
శ్వజనం కాగలదు. సకలం శకలం సకృత్ శకృత్ కాగలదు.
కాబట్టి శ ష ల గుర్రింపు లేకుండా మాటాడే వాని
ముడ్డికి మూతికి దంతాలు తప్ప భేదం ఉండదని
భట్టి కొంచెం గట్టిగానే మందలించాడు.
స్వజనం - తనవారు,
శ్వజనం - కుక్కలవారు
సకలం - సమస్తం, అంతా
శకలం - ముక్క, కొలది భాగం
సకృత్ - అరుదు
శకృత్ - మలం
ఇవి వీని అర్థాలు. కాబట్టి విద్యావంతులు
వ్యాకరణం తప్పక తెలుసుకోవాలి.
శబ్దపరిచయం కలవారై ఉండాలి.
ఇది నేటి సమాజంలో ఆవశ్యకమైనది.
ఏ పదాని ఏ అర్థం వస్తుందో తెలియకుండా
వాడేస్తున్నారు ఇది మంచిది కాదని ఆ కాలంలోనే
చెప్పాడంటే ఇది ఇప్పటి అలవాటు కాదని గ్రహించాలి.
కానీ విషయం తెలిసి పదాలను వాడడటం మంచిది.
No comments:
Post a Comment