Friday, December 2, 2016

వలిగుబ్బ చనుంగవ ఠీవి


వలిగుబ్బ చనుంగవ ఠీవి




సాహితీమిత్రులారా!



కవయిత్రి మొల్ల తన రామాయణంలో
తెలుగు కవిత్వం ఎలా ఉంటే బాగుంటుందో
ఈ పద్యంలో చెప్పింది చూద్దాం-

వలిపపు సన్నపయ్యెదను వాసిన గంధపుపూతతోడుతన్
గొలదిగ గానవచ్చు వలిగుబ్బ చనుంగవ ఠీవి నొప్పగా
తెలుగని చెప్పుచోట గడుతేటల మాటల క్రొత్త రీతులం
బొలుపు వహింపకున్న మరి పొందగునే పటహాది శబ్దముల్

సన్నని తెల్ల వస్త్రపు పైటలో,
చందన లేపనం చేసిన లావైన
గుండ్రని స్తనయుగం ఏ విధంగా
అరచాటుగా కనిపిస్తుందో,
తెలుగు కవిత్వం కూడ తేట
మాటలతో కొత్త పద్ధతులతో
మనోహరంగా ఉండాలి.
అలా కాక తప్పెట ధ్వనుల
వంటి కఠిన శబ్దాలతో, దీర్ఘ సమాస
ప్రౌఢ బంధాలలో ఇంపు కలిగిస్తుందా?
(కలిగించదని భావం)

No comments:

Post a Comment