తప్పు లెంచక నుండుట తగిన లెస్స
సాహితీమిత్రులారా!
సర్వజ్ఞ త్రిశతి (కన్నడము)-
ప్రజాకవిగా పేరు పొందిన
సర్వజ్ఞ కృతము
త్రిపదిలో వ్రాయబడినది.
దీనిని తెనుగున
శివకవి యన్. శివగౌడు వ్రాశారు.
సర్వజ్ఞ కవి 15శతాబ్ది ఉత్తరార్థములోను,
16 శతాబ్ది పూర్వార్థములోను ఉన్నట్లు చెబుతున్నారు
ఆ త్రిశతిలోని కొన్ని నీతులు చూడండి -
జాజియ హోలేసు, తేజి వాహన లేసు
రాజమందిరదొళిరలేసు తప్పుగళు
మాజుమాజువదె లేసు సర్వజ్ఞ (కన్నడము)
జాజి పూలెస్స పయనించ వాజి లెస్స
రాజమందిర వాసంబు రాణ లెస్స
తప్పులెంచకనుండుట తగిన లెస్స
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర
బెచ్చనెయ మనెయాగి వెచ్చక్కె హొన్నాగి
ఇచ్చెయను అరివ సతియాగి స్వర్గక్కె
కిచ్చు హచ్చెంద సర్వజ్ఞ (కన్నడ)
వెచ్చదనమిచ్చు భవనంబు, వెచ్చమునకు
వచ్చు సిరి, వశవర్తిని భార్యగలుగ
స్వర్గమేటికి కాల్పనా జనుల కరయ
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర
ఉరగన హలునంజు సురిగెయ మొనెనంజు
కరుణ విల్లదన నుడినంజు దుర్జనర
ఇరవెల్లనంజు సర్వజ్ఞ (కన్నడము)
త్రాచుకోర విషము, ఖడ్గధార విషము
ఎన్న నిర్దయు నుడికార మెల్ల విషము
ధూర్తుడగువాని ఇరవెల్ల దోగు విషము
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర
దీనికి మన సుమతి శతకంలోని పద్యం -
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృచ్ఛికమునకున్
తలతోక యనక నుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
ఎళ్ళు గాణిగ బల్ల, సుళ్ళు సింపెగ బల్ల
కళ్ళరను బల్ల తలవార, బణజిగను
ఎల్లవను బల్ల సర్వజ్ఞ (కన్నడము)
తిలల నెరుగును గానుగ ద్రిప్పువాడు
తలవరెరుగును చోరుల, దర్జివాడు
ననృతమెరుగును వర్తకుండఖిల మెరుగు
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర
No comments:
Post a Comment