ఏ ధనం ఉత్తమమైనది?
సాహితీమిత్రులారా!
ఏ ధనం ఉత్తమమైనది అంటే
నల్లధనమా?
తెల్లధనమా ?అని కాదు
ఏవిధంగా చేకూరిన ధనం అని
దీన్ని గురించి
చెప్పే శ్లోకం చూడండి-
ఇది నీతిశాస్త్రంలోనిది-
ఉత్తమం స్వార్జితం విత్తం
మధ్యమం పితురార్జితమ్
అధమం భ్రాతృవిత్తంచ
స్త్రీ విత్త మధమాధమమ్
తాను సంపాదిచిన ధనం ఉత్తమమైనది.
పూర్వికుల సంపాదన మధ్యమం.
సోదరుల సొమ్ము అధమం.
కాని స్త్రీల వల్ల చేకూరిన ఆర్జనతో
జీవించడం నీచమైనది. కాని నేడు
ఇదే అతిగొప్ప కృత్యమైంది అతి సహజమైంది.
No comments:
Post a Comment