Saturday, December 3, 2016

సిగ్గు బిడియాలను వదిలేయాలి


సిగ్గు బిడియాలను వదిలేయాలి




సాహితీమిత్రులారా!



సిగ్గు బిడియం లేదా?
ఏం మనిషివి?  అంటూంటారు
దేనిలో సిగ్గు బిడియం వదిలేయాలో
ఈ శ్లోకంలో చూడండి-
ఇది నీతిశాస్త్రంలోనిది-

గీతే వాద్యే తథా నృత్తే
సంగ్రామే రిపు సంకటే,
ఆహారే వ్యవహారేచ
త్యక్త ర్లజ్జా సుఖీ భవేత్


సిగ్గు బిడియాలు మానవుల కుండాల్సిందే
అయినా ఇవి అన్నివేళలా పనికిరావు.
కొన్ని సందర్భాలలో వీటిని పక్కన పెట్టాలి-

నాట్యం చేసేప్పుడు, పాటపాడేప్పుడు,
వాయిద్యాలు వాయించేప్పుడు,
పోట్లాట జరిగేప్పుడు, శత్రువులతో వాదం
లేదా పోరు జరిగేప్పుడు, భోజనం దగ్గర,
వ్యవహారాలు(లావాదేవీలు) జరిగేప్పుడు,
అతి చనువు ఉన్నవారి దగ్గర మొహమాట
పడకూడదు. దీనివల్ల నష్టమేకాని లాభంగాని
సుఖంగాని ఉండదు.

ఈ చెప్పిన చోట్ల సిగ్గు బిడియం వదిలేయాలి.


No comments:

Post a Comment