Tuesday, December 6, 2016

ఇవి ఆచరించే వారిని లక్ష్మి వదిలి వెళుతుంది


ఇవి ఆచరించే వారిని లక్ష్మి వదిలి వెళుతుంది



సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి-
నీతిశాస్త్రంలోనిది.

కుచేలినం, దంతమలాపహారిణం
బహ్వాశినం, నిష్ఠురవాక్య భాషిణమ్,
సూర్యోదయే చాస్తమయేచ శాయినం
విముంచతి శ్రీ రపి చక్రపాణినమ్

దంతధావనం చెయ్యకపోవడం,
మలిన వస్త్రాలు ధరించడం,
అతిగా భోజనం చేయడం,
కఠినమైన పలుకులు పలకడం,
ఉభయ సంధ్యలలో(ఉదయ సంధ్య, సాయంసంధ్యల్లో)
నిద్రిస్తూ ఉండడం - ఇవన్నీ దారిద్ర్యానికి గుర్తులు.
ఇవి ఆచరిచే వారిని, ఏకంగా శ్రీమహావిష్ణువునైనా
సరే లక్ష్మి నిర్దాక్షిణ్యంగా వదలి వెళ్ళిపోతుందట.

మరి మీలో ఎవరికైనా
ఈ అలవాట్లు ఉన్నాయేమో? గమనించండి.
దాదాపు ఉండవు లెండి. అలా ఉన్నవారికి
వివరించండేఁ

No comments:

Post a Comment