Tuesday, June 7, 2016

భావిదృష్టి


భావిదృష్టి


సాహితీమిత్రులారా!

ఇది శ్రీశ్రీ  "ప్రభవ" లోని పద్యకవిత చూడండి.

చ. అట కవితా ప్రపంచము లహర్నిశమున్ రసవన్నవీన వి
    స్ఫుట నటనాప్రసక్తి మెయిసోలును, తేలుననంత హర్షపున్ 
    ఘటికలలో సహస్ర రవికాంతులు మేదుర రమ్య వర్ణ సం
    ఘటనము కూర్చి, నాకదియె కామ్యపథమ్ము భవిష్యదాశలన్

ఉ. నా తలపోత లీక్షణమునన్ పరువెత్తు నదృశ్య పక్ష సం
    పాతముతో, రయోద్ధత సుపర్వ విమాన పలాయన క్రియా
    తీతములై - సుధామధుర దివ్యపధాలకు, భావికాల వి
    ద్యోతిత నాట్యశాలలకు, జ్యోతిరఖండ యశోంగణాలకున్ 

ఉ. భావి వికాస వాటికల బాటలలో చనునాకు నా కవి
    త్వావృత గీతులే వినగనౌను చలద్గరుదంచలమ్ములై 
    దైవధనీ ప్రసన్న సికతాస్థలులన్  విహరించు నాకు నా 
    పూవుల పాటలే వరద పోవును తేనియ తేట యూటలన్ 

ఉ. నా నిపుడే  వదించిన అనేక రహశ్శృతు లాలకించగా 
    లేని జగత్తులో ప్రతిఫలించదు నా హృదయమ్ము నేడు సం
    ధ్యా నిశితారుణ  ప్రభలు దాచిన యామినిలో చరించు నా 
    మానస మింక  భావి సుషమా వికసద్రుచు లాస్వాదించెడున్

రచన - 1929 సెప్టెంబరు 16
ముద్రణ - భారతి - నవంబరు 1929

2 comments:

  1. చివరి పద్యం ‘నే నిపుడే వచించిన...’ అని ప్రారంభం కావాలనుకుంటాను.

    ReplyDelete
  2. కంది శంకరయ్యగారికి నమస్కారం,
    మీరు చెప్పినట్లు భావిదృష్టి కవితలో చివరి పద్యం 'నే నిపుడే వచించిన' - అని ఉండాలి. కాని 'వదించిన' అనే అందులో ఉంది. 'వద్' అన్నా 'వచ్' అన్నా ఒకటేకదా అందువల్ల అది సరైనదేనని నాభావన.

    ReplyDelete