ఇలాంటి మరుదులున్నారా?
సాహితీమిత్రులారా!
పూర్వం ఎలాంటి మరుదలుండేవారో
ఈ శ్లోకం చూడండి.
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే!
నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్!
(వాల్మీకి రామాయణము)
సీతను అన్వేషిస్తూ వెళ్ళే రామలక్ష్మణులకు సుగ్రీవుని దగ్గర నగలమూట దొరికింది.
అవి సీతవేనేమో? చూడమని సుగ్రీవుడు చూపించాడు.
నగలు చూడగానే కళ్ళనీళ్ళు క్రమ్ముచున్న రాముడు,
లక్ష్మణా!
ఆ నగలు సీతవేనేమో? చూడు అన్నాడు.
దండలు కడియాలు
కర్ణాభరణాలు సీతవగునో? కాదో?
నాకు తెలియదు
అందెలు(కాళ్ళగొలుసులు) మాత్రం సీతవని నాకు బాగా తెలుసును.
నిత్యము పాదాభివందనం చేసేవాడిని కావడంవల్ల
అవి సుపరిచితాలు అన్నాడు.
వదినగారియందు లక్ష్మణునికి ఉన్న పవిత్రభావం
దీన్ని బట్టి వ్యక్తమౌతుంది.
మరి
ఇప్పుడు ఇలాంటి మరుదులు ఉన్నారా?
No comments:
Post a Comment