Sunday, June 5, 2016

స్వేదబిందువుల్ చిటిలించు పొందు లుడిగి


స్వేదబిందువుల్ చిటిలించు పొందు లుడిగి


సాహితీమిత్రులారా!

కవుల ఊహలు భావనలు వింత వింతగా మనకు దర్శనమిస్తాయి.
19వ శతాబ్దం మొదట ఉన్న గొట్టెముక్కల నరసింహరాజు తాను పెంచిన
గోరు ప్రమాదంవల్ల పోతే
దానిమీద ఒక సీసపద్యం చెప్పాడు
చూడండి.

కుంభి కుంభస్తనీ కుచగుళుచ్ఛములపై చంద్రవంకలు తీర్పు జాడమాని
ఘనఘనాఘన వేణికా కచంబులమీద చిక్కలన్నియు బాపు చెలువు వదలి
హారభాసుర కుచాగ్రహారి కుచాకీర్ణహార పంక్తులు దిద్దు దారి వదలి
బహువిధ రతిఖిన్న భామాముఖ స్వేదబిందువుల్ చిటిలించు పొందు లుడిగి
కామినీ స్వర్ణ రంభా శిఖాసువర్ణ
మార్దవా వాసపృష్ఠ సంభావ్య మాన
నవ్య కండూతి వాపెడు నయము వదలి
పోయెగో గోరు మా చేతి పొందు మాని

(కుంభస్తనుల కుచాల మీద క్షతాలు చేసి చంద్రవంకలు తీరుస్తూ,
అక్కడి హారాలు సరిచేస్తూ, జుట్టు చిక్కు తీస్తూ,
రతిలో అలసిన ప్రియురాలి ముఖం మీది చెమట బిందువులు తొలగిస్తూ,
బంగారు వంటి అరటి బోదెల వంటి తొడలను,
పిరుదులను నిమురుతూ ఉండే
నా గోరు పోయింది గదా!)

ఆ కవి ఏవిధంగా గోరు పోయినందుకు చింతించాడో చూడండి.
అది కవి హృదయం
ఏం జరిగినా
అది పద్యాలలోనే వెలిబుచ్చేవారు
ఆ కాలంలో మరినేడు
ఆ తీరు మారింది.

No comments:

Post a Comment