Wednesday, June 1, 2016

క్రియాస్తం నిరవధి కరుణా వారిధీ పార్వతీశౌ


క్రియాస్తం నిరవధి కరుణా వారిధీ పార్వతీశౌ


సాహితీమిత్రులారా!

మనుచరిత్రలోని "అంకముఁజేరి శైలతనయాస్తనదుగ్ధము లానువేళ"
 - అనే పద్యాన్ని గురించి తెలిసికొని ఉన్నాము.
ఇప్పుడు మరొకటి గజాస్యుని శంకలతోకూడిన శ్లోకం
రాజశేఖర సుధీ కృత "అలంకారమకరంద:" అనే అలంకారశాస్త్రం
ప్రారంభశ్లోకం ఇది
చూడండి.

కుంభౌ మే మూర్ధ్ని కస్మా దయి జనని కథం వక్షసి స్త స్త వేమౌ 
తాత: కిం తావకీనౌ స్పృశతి న తు కథం మామకీనౌ వద త్వమ్
ఇత్యేవం బాల లంబోదర మధుర గిరా స్మేర వక్త్రరవిందౌ
కల్యాణం వ: క్రియాస్తం నిరవధి కరుణా వారిధీ పార్వతీశౌ


గణపతి స్వామి ఏనుగు గలవాడు.
ఏనుగు తల పై భాగాము రెండు చిన్న కుండలు
బోర్లవేసిన ప్రాంతంవలె కనబడుతూ ఉంటుంది.
కలశములవంటి స్త్రీ వక్షస్ధలం ఉన్నట్లుగా భాసిస్తూ ఉంటుంది.
దీనిమూలంగా కవి గజాననునికి రెండు
సందేహాలున్నట్లు ఇందులో కల్పించాడు.

1వ సందేహం - కుంభములు తన తల్లికి వక్షస్థలముపై మొలవగా
                       తనకు తలపై మొలవడమెందుకు?
2వ సందేహం - తన తండ్రి తన తల్లి వక్షస్సీమ యందలి కుంభములను పరామర్శించి
                      ఆనందిచిన విధంగా తన తండ్రియగు శివుడు
                      తన కుంభస్థల పరామర్శతో ఆనందిచడెందలకు?
ఇవి తన తల్లిదండ్రులను అడుగగా వారు గజాననుని
అమాయకత్వానికి ముసిముసి నవ్వులు మొలకెత్త వారు
ఒకరినొకరు చూచుకొనుచున్న దయాసముద్రులగు
పార్వతీపరమేశ్వరులు 
మీకు శుభములను చేకూర్చదురుగాక! 

No comments:

Post a Comment