మూఢుండెరుగునె? సత్కవి గూఢోక్తుల సారమెల్ల?
సాహితీమిత్రులారా!
ఈ పద్యం పరికించండి కవి ఎంత సూటిగా నిక్కచ్చిగా చెప్పాడో
మూఢుండెరుగునె సత్కవి
గూఢోక్తుల సారమెల్ల, కోవిదుని వలెన్!
గాఢాలింగన సౌఖ్యము
ప్రౌఢాంగన యెరుగుగాక, బాలేమెరుగున్?
ప్రౌఢకవి ప్రయోగించిన శబ్దశక్తుల, మాటలయొక్క అర్థామును,
అంతస్సారాన్ని, పండితుడు తెలుసుకున్నట్లుగా, మూర్ఖుడు,
అజ్ఞాని తెలుసుకోగలడా?
ఏవిధంగా అంటే -
గాఢంగా కౌగిలించుకుంటే దానిలోని సుఖాన్ని
ప్రౌఢాంగన (18 సంవత్సరాలు పైబడిన అమ్మాయి)
అనుభవించగలదుకాని బాల్యావస్థలో ఉన్న
చిన్నపిల్లకేం తెలుస్తుంది? - అంటాడు కవి.
No comments:
Post a Comment