నారాయణ ప్రణయినీ నయనాంబువాహ:
సాహితీమిత్రులారా!
శంకరాచార్యులవారి "కనకధారా స్తవం" నినే ఉంటారు.
అందులోని ఓ ముఖ్య శ్లోకం చూడండి.
దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబు ధారామ్
అస్మి న్నకించన విహంగ శిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చీరాయదూరం
నారాయణ ప్రణయినీ నవాంబువాహ:
( కనకధారా స్తవం-8)
"ఓ పరమేశ్వరుడా "ధనం" అనే మేఘాల సమూహానికి -
నీ "దయ" అనే వాయువుని వీచవలసినంత అనుకూలతతో వీచి -
"లక్ష్మీకటాక్షం" అనే వర్షాన్ని కురిపించి -
"పేదతనం" అనే వేసవి ఎండకి తట్టుకోలేక అవస్థపడుతున్న
ఈ "స్త్రీ" - అనే పక్షిపిల్లని రక్షించి - పుణ్యం కట్టుకోవయ్యా!" అని దీని అర్థం.
అంతే
ఆమె ఇంటినిండా
బంగారు ఉసిరిక కాయల
వర్షం కురిసింది.
No comments:
Post a Comment