ప్రతి పర్వ రసోదయమ్
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చూడండి.
భారతంచ ఇక్షుఖండంచ సముద్రమపి వర్ణయ
పాదే నైకేన వక్ష్యామి "ప్రతి పర్వ రసోదయమ్"
ఈ కవిని ఏవరో ఒక మహానుభావుడు
"భారతము - చెఱకుగడ - సముద్రము" ఈ మూడింటిని
ఒకశ్లోకంలో చెప్పమన్నారట.
ఆయన చెప్పాడు ఒక శ్లోకంలో కాదు
ఒక పాదంలో చెబుతాను
నీకేమైనా అభ్యంతరమా! అని అన్నాడట.
ఆ పాదం
ప్రతి పర్వ రసోదయమ్ -
ప్రతి పర్వ రసోదయమ్ = భారతంలో ప్రతి పర్వం నందు
రసము చిప్పిలుచుండును.
ప్రతి పర్వ రసోదయమ్ = చెఱకుగడలో ప్రతి కణుపు
నందును రసముండును.
ప్రతి పర్వ రసోదయమ్ = సముద్రము ప్రతి
పర్వదినను పొంగును.
- అని భావం.
No comments:
Post a Comment