Thursday, June 2, 2016

ఆంధ్రవధూటి చొక్కపుంజనుగవబోలె


ఆంధ్రవధూటి చొక్కపుంజనుగవబోలె


సాహితీమిత్రులారా!

కవిత్వం ఎలా ఉండాల?
లోకోభిన్నరుచి: అన్నట్లు
ఎవరి రుచి వారిది ఎవరి అభిరుచి వారిది.
ఒక కవి ఈ విధంగా చెప్పాడు చూడండి.

ఘనతర ఘూర్జరీ కుచయుగక్రియ గూఢముగాక ద్రావిడీ
స్తనగతి తేటగాక అరచాటగు నాంధ్రవధూటి చొక్కపుం
జనుగవబోలె గూఢతయు చాటుదనంబును లేకయుండ చె
ప్పిన నదె పో కవిత్వ మనిపించు నగించటు కాక యుండినన్

ఘూర్జర కాంతలు వక్షోజాలసలు కనబడకుండా
నిండుగా కంచుకం తొడుక్కుంటారు.
కవిత్వం అంత గూఢంగాలోపల ఏమున్నదో
తెలియకుండా ఉండకూడదు.
ఇక ద్రావిడాంగనలు వారసలు కంచుకమే
తొడుక్కోరట పైటకూడ వేసుకోరట.
(ఇది ఒకప్పటి మాట నేడుకాదు. నేడును ఎక్కడో
కుగ్రామాలలో ఆ సాంప్రదాయం ఉందేమొ)
కవిత్వం మరీ అంత బట్టబయలుగా ఉండకూడదు.
ఆంధ్ర స్త్రీలు రవికలు వేసుకొంటారు. పైట వేసుకొంటారు.
అయినా అత్యంతాకర్షణీయంగా ఉంటారు.
కవిత్వం అంటే అలా ఉండాలిమరి.
లేకపోతే నగుబాటు పాలవుతుంది.


ఇదే భావాన్ని సకల కథాసార సంగ్రహంలో రామభద్రకవిగారు ఈ విధంగా చెప్పారు.

అరవత గుబ్బ చన్వలె బయల్పడనీకను ఘూర్జరాంగనా
గురు కుచ యుగ్మముంబలె నిగూఢము గాకను ఆంధ్రదేశ పుం
గరిత చనుంగవంబలె ఒకానొక యించుక కానిపించినన్
సరసులు మెత్తు రక్కవిత జాణలకున్ కడు రంజకంబగున్

No comments:

Post a Comment