Friday, June 3, 2016

తవిలి వర్తించు మా కవితా వధూటి


తవిలి వర్తించు మా కవితా వధూటి


సాహితీమిత్రలారా!
జంటకవులు తిరుపతి వేంకటకవులు

విజయనగరం వెళ్ళినపుడు
తమ కవిత్వానికి శృంగారాన్నీ శృంగారవతులనూ ఆలంబనగా చేసుకొని
మళ్ళీ పాత పంథాలోనే తమ కవితను వధూటిని చేసి.
ఆ చెలువ లీలావిలాసాలను కవిత్వానికి అన్వయించి
రసికజన రంజనంగా చెప్పిన పద్యం ఇది
నేటికీ ఆనందజనకంగానే ఉంది
చూడండి.

పురుషాయిత మొనర్చు పూబోణి ముద్దు చేష్టల రంగు లొక్కొక్క సమయమందు
ప్రణయ కోపాకుల ప్రౌఢ కాంతామన: పాటనం బొక్కొక పట్టునందు
ఈషద్బలాత్కార మృదితాధరోష్ఠీ దృ శాలలీ లొక్కొక్క వేళయందు
అనునీత ఖండితా హావభావాది సాం కర్యమ్ము నొక్కొక్క కాలమందు
తవిలి వర్తించు మా కవితా వధూటి
రస మెఱింగిన మీవంటి రసికవరుల
కే తగును గాక అన్యుల కెట్లు తగును?
శ్రీ మదానంద గజపతి క్షితితలేంద్ర!

వివిధ భావాలను ప్రదర్శించే నాయికల
హావభావ లీలావిలాసాలు ఏ విధంగా ముగ్ధంగా,
మోహనంగా, ప్రౌఢంగా, చాతుర్యంగా, ఛలోక్తి చమత్కార మంజులంగా,
ప్రణయ కలహోల్లాసంగా ఉంటాయో, కవిత్వం కూడా ఆ విధంగానే -
బహువిధ భావబంధురంగా, కామినీ స్పర్శానంద స్పందకంగా
ప్రకాశిస్తుందని
కవిరాజుల భావన.

No comments:

Post a Comment