Wednesday, June 1, 2016

అభిసారికయు దండ మిచ్చి తీఱు


అభిసారికయు దండ మిచ్చి తీఱు


సాహితీమిత్రులారా!


గద్వాల సంస్థానంలో తిరుపతి నేంకటకవులు తమ కవిత్వము
గురించి చెబుతూ రసాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మెత్తా కఠినంగా,
మధ్యరకంగా, రకరకాలుగా కవిత్వాన్ని చెబుతామంటూ దానికి
కాంతా సంబంధాన్ని కల్పిస్తూ జంటకవులు చెప్పినది
ఈ పద్యం.........

ముద్దు ముద్దుగ చెప్పబూనితిమా, వన్నెలాడి తీయని మోవి లంచమిచ్చు
కఠినమ్ముగా చెప్పగడిగితిమా, ప్రౌఢకాంత వక్షోజముల్ కాన్క లొసగు
తీక్ష్ణరీతిని చెప్ప తెరకొంటిమా, వాలు గంటి లేజూపు సుంక మ్మొసంగు
మిశ్రమరీతిని చెప్ప మేకొంటిమా, బోటి బిగువు కౌగిలి పన్ను బెట్టి తీరు
ఆశుధారా కవిత్వమ్ము నందుకొంటిమేని అభిసారికయు దండ మిచ్చి తీఱు
ఆంధ్ర గీర్వాణ భాషల యందుమాకు దళిత పండితలోప గద్వాల భూప


(ముద్దు ముద్దుగా చెప్పాలనుకుంటే బింబోష్ఠి తీయని పెదవి లంచంగా ఇస్తుంది.
అంటే అధరామృతంలాగా తియ్యగా ఉండే కవిత్వాన్ని చెబుతామని అర్థం.
కఠినంగా చెబితే ప్రోఢస్తనాలను కానుకగా ఇస్తుంది.
అంటే ఆ కాఠిన్యం స్తనకుంభ కఠినమన్నమాట.
అలానే తీక్ష్ణరీతిగా చెప్పాలనుకుంటే వాల్జూపులు సుంకాలుగా వస్తాయి.
కలగలుపుగా చెప్పాలనుకుంటే కాంత బిగికౌగిలి సమర్పించుకుంటుంది.
ఇక ఆశుధారగా కవిత్వం చెప్పబూనితే అభిసారిక కూడా దండమిచ్చి తీరుతుంది.)

No comments:

Post a Comment