Saturday, May 21, 2016

జయంతి అంటే జన్మదినం కాదా!


జయంతి అంటే జన్మదినం కాదా!


సాహితీమిత్రులారా!

సాధారణంగా భౌతికంగాలేని మహనీయుల
పుట్టినరోజులను జయంతి అని వాడుకలో వాడుతున్నారు.
దీన్ని గురించి "వాడుకతెలుగులో అప్రయోగాలు" అనే పరిశోధకగ్రంథంలో
వివరించడం జరిగింది.
దాన్ని ఒకసారి గమనిద్దాం.

మేదినీకోశంలో (నానార్థ నిఘంటువు) -
జయంతీ అంటే వృక్షవిశేషం(తక్కిలి చెట్టు), పార్వతి, ఇంద్రసుత, పతాక అనే అర్థాలున్నాయి.
అమరకోశంలోనూ జయంతీ పదానికి వృక్షవిశేషమనియే ఉన్నది.
వాచస్పత్య నిఘంటువులో - జయంతీ అనే పదానికి దుర్గాశక్తి,
ఇంద్రసుత, పతాక,తక్కిలి చెట్టు, యాత్రాయోగవిశేషములతోపాటు
రోహిణీ నక్షత్రముతో కూడిన శ్రావణ కృష్ణాష్టమి అనే అర్థాన్ని కూడా చూపింది.
ఏ నిఘంటువులోను జయంతీ అనే శబ్దానికి జన్నదినం అనే అర్థం చూపలేదు.
కానీ ఈ లోకంలో శంకర జయంతి,
నృసింహ జయంతి, గాంధీ జయంతి
మొదలైన పదాలలో జన్మదినం అనే అర్థంలో వాడుకలో ఉన్నది.
 ఐతే ఈ శబ్దానికి కేవలం జన్మదినం అనికాక అవతారపురుషుల
జన్మదినం, మరణించిన మహాపురుషుల జన్మదినం అనే
విశేషార్థంల్లో వాడుకలో ఉంది.

వాచస్పత్య నిఘంటువులోని ప్రమాణం విష్ణుధర్మంలోనిది -

రోహిణీ చ యదా కృష్ణ పక్షే2ష్టమ్యాం ద్విజోత్తమ
జయంతీ నామ సా ప్రోక్తా సర్వపాపహరా తిథి:

అలాగే సనత్కుమారసంహితలోని ప్రమాణం-

శ్రావణస్య చ మాసస్య కృష్ణాష్టమ్యాం నరాధిప
రోహిణీ యది లభ్యేత జయంతీనామ సా తిథి:


శ్రావణే వా నభస్యే వా రోహిణీసహితాష్టమీ
యదా కృష్ణా నరైర్లబ్దా సా జయంతీతి కీర్తితా  (వసిష్టసంహిత)

వీటి ఆధారంగా జయంతీ శబ్దానికి రోహిణీ నక్షత్రంతో
కూడిన కృష్ణాష్టమి అనే అర్థమే తేలుతుంది.
కానీ జన్మదినం అనే అర్థం రాదు.
కాని కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం కావడం వల్ల
రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమిని తెలియజేసే
జయంతీ శబ్దం మహాత్ముల జన్మదినంగా
వ్యాకోచాన్ని పొంది ఉండవచ్చు.

14 comments:

  1. అంతా సోది

    ReplyDelete
    Replies
    1. మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి... హనుమంతుడు chiranjeevi.. చావు లేని వాడు కాబట్టి జన్మోత్సవం అనాలి..

      Delete
    2. భౌతికంగా లేని వారి పుట్టిన రోజు అంటున్నారు. మరి మరణించిన వారికి జన్మ దినం ఏమిటో. ఈ లాజిక్ నాకస్సలు అర్థం కావడం లేదు.

      Delete
  2. సోది కాదు. మనకి అర్థం కాకపోతే సోది ఏనా? బుర్ర పెంచుకొనే ప్రయత్నం చేస్తే, మంచిది.

    ReplyDelete
  3. స్పష్టంగా.. చెబుతలేరు...హనుమాన్ జయంతి అంటారు..
    మరి ఇది తప్పా చెప్పండి

    ReplyDelete
  4. హనుమాన్ జయంతి అనొచ్చా లేదా?

    ReplyDelete
    Replies
    1. అనకూడదు... జన్మోత్సవం అనాలి.. మరణం లేని వారికి జయంతి ఉండదు..

      Delete
  5. జన్మదినం జీవించి ఉన్న వారిని జయంతి చనిపోయిన వారిది అని అర్థం అవుతుంది ._కాని కలియుగంలో హనుమాన్ ఒక్కరే చిరంజీవి. *ధన్యవాదములు*

    ReplyDelete
  6. చక్కటి విశ్లేషణ....ధన్యవాదములు....జయంతి లాగానే...వర్ధంతి కూడా అర్థ బేధం కలిగి యుండి...ఈ రెండింటినీ సందర్భాన్ని బట్టి వాడుకోవాలి...కేవలం మహనీయులుగా జీవించిన వ్యక్తులకు, దేవుళ్ళకు "జయంతి" అను పదాన్ని వాడుతున్నారు...birthday అంటూ విశేష వేడుకలు చిన్నారులకు చేయడం, శుభాశీస్సులు ,శుభాకాంక్షలు తెల్పి కానుకలు అందించడం ఒక ఆన వాయితీ గా వస్తూ వుంది....

    ReplyDelete
  7. విశ్వకర్మ జయంతి...అని అనొచ్చా..
    విశ్వకర్మ ఉత్సవాలు.. అని అనలా..

    దయచేసి.. తెలుప గలరూ

    ReplyDelete
    Replies
    1. విశ్వకర్మ చిరంజీవి కాదు ... కేవలం హనుమంతుడు మాత్రమే .. మనం బ్రతికి ఉన్నన్ని రోజులూ జన్మోత్సవం అనాలి.. చనిపోయిన తర్వాత మన మహనీయులకు జయంతి అనాలి. మనలాంటి వారికి జన్మదినోత్సవ జ్ఞాపకార్థం అనాలి

      Delete
  8. హనుమంతుడు చిరంజీవి. హనుమాన్ జయంతి, విశ్వకర్మ జయంతి అనడం కూడా సరికాదు.

    ReplyDelete
  9. బదులుగా హనుమాన్ జన్మదిన మహోత్సవం జరపాలి.

    ReplyDelete
  10. మరి వర్ధంతి అంటే అర్ధం ఏమిటి గురువర్యా....

    ReplyDelete