స్త్రీలకు జడ వెనకే ఎందుకుంటుంది?
సాహితీమిత్రులారా!ఒకసారి తిరుపతివేంకటకవు చేత అవధానం చేయించిన గద్వాల రాజావారు
స్త్రీలకు రతిక్రీడకు ఉపకరించే భాగాలన్నీ ముందుభాగంలో ఉండి
ఒక్క జడమాత్రం వెనుకవైపు ఉండటంలోని విశేషము ఏమిటని అడిగారు.
దానికి జంటకవులు ఇచ్చిన
పద్యోత్తరం చూడండి.
పురుషాయితమొనర్చు పూబోడి కటిమీద నాట్యమ్ము సలుపు పుణ్యమ్ము కొరకొ
ఘననితంబస్థలంబను పెన్నిధానంబు బహు భద్రముగను కాపాడుకొరకొ
తానాశ్రయించు కాంతకు వెన్కభాగమ్ము ననుగూడ సౌందర్యమునుపు కొరకొ
పదిమంది దృష్టులు పడి కంటకమంచు నూహించి కనపడకుండు కొరకొ
వేణి కాంతల వెన్నంటి వ్రేలుచుండె
లేక యుండిన విధువనలీల కుపచ
రించునంగమ్ము లెదుటనే నంచునించ
దానికట్లుండ నే యుపద్రవము వచ్చె?
(స్త్రీలు పురుషాయితం చేసేప్పుడు నడుముమీద నాట్యం చేయటానికొ,
పిరుదువనే నిధులను కాపాడటానికి నాగుబాము వలె ఉండటానికో,
తానాశ్రయించిన స్త్రీ వెనుకవైపుకూడా సౌందర్యాన్ని ఉంచటానికో,
ఎదురుగా ఉంటే దృష్టిదోషం తగులుతుందనో, వేణి వెనుకవైపున ఉన్నది.)
ఎదుటన్ వర్తిలునట్టి అంగముల కెంతేనిన్ నఖాదిక్షతా
పద పల్మారును గల్గు సంగతిని తా ప్రత్యక్షమున్ జూచి నె
మ్మదిలో భీతిలి చాటు చోటనుచు సంభావించి వెన్నంటుచున్
పొదలన్ బోలును వేణి లేకునికి దాముందుండ కట్లుండున్?
(ఎదురుగా ఉన్న అవయవాలన్నిటికి దెబ్బలే,
నఖక్షతాలు, దంతక్షతాలు మొదలైనవి.
వాటిని చూస్తూ భయపడి ముందుంటే ఇటువంటి
పోటుల కోర్చుకోవాల్నే అని వెనుక చేరి ఉంటుంది వేణి.)
- అని సెలవిచ్చారు
వేంకటకవులు.
No comments:
Post a Comment