Wednesday, November 9, 2016

అంభోజాతాక్షి వేణిన్ హరువు గనిన...


అంభోజాతాక్షి వేణిన్ హరువు గనిన...




సాహితీమిత్రులారా!




కాళ్ళకూరి నారాయణరావుగారిని
ఒక అవధానంలో అక్కడివారు
తల వెంట్రుక మీద స్రగ్ధర చెప్పమన్నారట
అక్కడ వారు చెప్పిన తలవెంట్రుక పద్యం-

అంభోజాతాక్షి వేణిన్ హరువు గనిన రోమాటి సౌభాగ్యమెంతే
సంభావింతున్ వయోముక్సముదయరుచులున్ స్పారరోలంబ కాంతులన్
శుంభద్ద్వాంత ప్రభల్ హెచ్చుగ గొని విధి మె చ్చొప్పగా గూర్చి యాపై
జంభ ద్వి డ్రత్నరోచుల్ చమిరి యొనరుపన్ చక్కనౌ తీవయోనాన్

మబ్బువలె, తుమ్మెదవలె,
చీకటివలె, ఇంద్రనీలం వలె నల్లగా ఉన్న
తలవెంట్రుక అందం అంత పెద్ద పద్యానికెక్కింది.

No comments:

Post a Comment