ఆ ఒక్కటి లేకపోతే జగత్తంతా చీకట్లు క్రమ్మినట్లే
సాహితీమిత్రులారా!
స్త్రీల పట్ల వ్యామోహం చేత, వారియందు
అనురాగం కామం కలగిన పురుషులు స్రీలను
ఎలా ప్రశంసిస్తారో చెప్పెడి ఈ శ్లోకం
భర్తృహరి శృంగారశతకంలోనిది చూడండి-
సతి ప్రదీపే, సత్యర్కౌ, సత్సు తారా రవిన్దుషు,
వినా మే మృగశాబాక్ష్యా తమోభూత మిదం జగత్
వెలుగివ్వడానికి పగటిపూట సూర్యుడు, రాత్రులలో చంద్రుడు,
నక్షత్రాలు, అన్నివేళలా అగ్నిహోత్రుడు, దీపాలు ఉన్నప్పటికీ
లేడిపిల్ల కన్నులను పోలిన స్త్రీ ఒక్కటి లేకపోవడం జరిగితే
జగత్తు అంతా చీకట్లు కమ్మినట్లే ఉంటుంది. ఓసి స్త్రీ దీపమా
నీవు కానరాక నేను జడుడినైతిని. నాకంటికి వెలుగునిచ్చే
నా ప్రేయసి లేని బ్రతుకేల - అని ఒక ప్రియుడు
తన ప్రియమిత్రునితో చెప్పుకొని వాపోతున్నాడు.
ఎన్ని వెలుగిచ్చేవున్నా స్త్రీ లేనపుడే మోహాంధత్వము
సంప్రాప్తము అని అంతరార్థం.
No comments:
Post a Comment