Wednesday, November 9, 2016

ఎవరికి దేనిమీద ధ్యాస?


ఎవరికి దేనిమీద ధ్యాస?



సాహితీమిత్రులారా!




ఈ నీతిశాస్త్ర శ్లోకం చూడండి-

పుత్రేయధైక పుత్రాణాం, వైష్ణవానాం యథాహరౌ
నేత్రేయధైక నేత్రాణాం, తృషితానాం యధాజలే
క్షుతానాం యధాన్నేచ లౌములౌనాం యథాస్త్రియాం
యధావరన్యే చౌరాణాతి, యధాజారే కుయోషితాం
విదుషాంచ యధాశాస్త్రే వాణిజ్యే వణిజాయంధా,
తథా శశ్వన్మన: లౌంతే సాధ్యీనాం యోషితాం ప్రభో


విష్ణు భక్తులకు విష్ణువే సర్వస్వం.
ఒక్కడే కొడుకుంటే తల్లిదండ్రులకు
ఆ పుత్రునిమీదే మమకారం.
ఒక్క కన్నే ఉన్నవానికి
దానిమీద జాగ్రత్త అధికం.
ఇలాగే మనస్సు నిత్యం తమకు
ఇష్టమైన వాటుపై లాగుతూ ఉంటుంది.
కామాంధునికి స్త్రీ మీద, జారునికి కులట మీద,
వర్తకునికి వ్యాపారం మీద, దొంగలకు పరులసొత్తుమీద,
పండితునికి శాస్త్రల మీద,
సతికి పతిమీద నిరంతర ధ్యాస ఉంటుంది.
ఇది సహజమేకదా!

No comments:

Post a Comment