Saturday, November 19, 2016

మనసు రూపును మాపు


మనసు రూపును మాపు




సాహితీమిత్రులారా!




గణపతి ముని రమణమహర్షులవారి
ఉపదేశసారాన్ని సంస్కృతంలోనూ,
తెలుగులోనూ రచించారు.
వారి తెలుగు ద్విపదలను
ఇక్కడ కొన్నిటిని చూద్దాం-


మనసు రూపును మాపు మహనీయ యోగి
తన రూప మందిన పని లేనివాడు

భావ భేదము కంటె పరుడు నేన నెడు
భావనా భేదమే పరమోత్తమ మగు

భావ బలంబుచే భావనాతీత
భావస్థితి మునులు పరభక్తియనిరి

నే నడంగిన చోటు నేను నే ననుచు
తానుగా దోచును తాను పూర్ణంబు

తా నుపాధి వదలి తన్నెరుంగుటయె
తానుగా వెలుగీశ తత్వ దర్శనము

తానుగా నునికియే తన్నెరుంగుటర
తానురెండెక్కడ తన్మయ నిష్ఠ

బంధ ముక్తులు లేని పరసుఖసిద్ధి
పొందును దైనిక పుణ్యచరితుడు

అహము లేనిది స్వయమను భూత నిష్ఠ
మహదుగ్రతపమనె మహి రమణ ఋషి

No comments:

Post a Comment