చిగురు విల్తుని అప్ప చేబూను
సాహితీమిత్రులారా!
మనం శంఖాలను చూస్తుంటాము
కాని వాటిని గురించి
పెద్దగా తెలిదనే అనాలి.
సముద్రంనుండి శంఖం
పుడుతుందనిమాత్రం తెలుసు.
వాటిలో వామావర్తము అని
దక్షిణావర్తమని రెండురకాలట.
సామాన్యంగా వామావర్త శంఖాలు
దొరుకుతాయి కాని దక్షిణావర్త శంఖాలు
అరుదుగా దొరుకుతాయట.
ఇవి దొరికితే ఎంతో అదృష్టంగా చెబుతారు.
వాటినుండి ప్రణవనాదం విపిస్తుందని
పూజావస్తువులలో దానికి అధిక ప్రాధాన్యమిస్తారు.
కొన్ని క్షేత్రాలలో పురాతన దక్షిణావర్త శంఖాలను
జాగ్రత్తపరచి వాటిని భక్తులచేత స్పృశించనిచ్చి
దాని నాదాన్ని వినే అవకాశం ఇచ్చి, దాని మహత్తును
వివరిస్తుంటారు. ఇంతా చెప్పొచ్చేదేమంటే
అలాంటి శంఖం
పూర్వం దామెర వెంకట భూపాలుని(గొప్పజమిందారు) వద్ద
పూజాగృహంలో ఉండేదట. దాన్నిగురించి ఆనాటి పిన్నలు
పెద్దలు ఎంతగానో చెప్పుకొనేవారట. అలాంటి దాన్ని
శిష్టు కృష్ణమూర్తి కవి ఆ శంఖాన్ని గురించి
మంచి ఊహలతో పద్యాలు చెప్పాడట.
వాటిలోని ఒక పద్యం చూడండి-
చిగురు విల్తుని అప్ప చేబూను నడిదంపు రకపు పసిండి పరం బనంగ
కొనసాగి దెసలల్లి కొన బ్రాంకు నతని కీర్తి ప్రతాపముల చేరిక యనంగ
చెలియలి కను వేడ్క చెంతకరుగుదెంచి నిలుచున్న చిన్నిజాబిలి యనంగ
ఆబిడ కీల్గంట నమరింప గూర్చిన కొమరారు బంగారు కెప్పుయనగ
పరగు నిందలి దక్షిణావర్త శంఖ
మౌర! దామెరకుల కలశాబ్ది సోమ!
విభవ నిర్ణిత సుత్రామ! విమలనామ!
సద్గుణ స్తోమ వెంకట సార్వభౌమ!
సముద్రంనుండి పుట్టినవారు లక్ష్మీ చంద్రులు.
బంగారు కుప్పెలో బిగించిన తెల్లని శంఖం
లక్ష్మీదేవిని చూడటాని వచ్చిన బాలచంద్రునివలె
ఉందని కవిగారు చమత్కారంగా ఊహించారు.
No comments:
Post a Comment