బాదల్ హవాకె ఊపర్
సాహితీమిత్రులారా!
నజీర్ కవి ఆద్మీనామా నుండి
కొన్ని భాగాలు చూశాము. ఇపుడు
"బర్సాత్ కీ బహార్"(వర్షాకాలపు శోభ) అనే
కవితనుండి నుండి రెండు పద్యాలు చూద్దాం-
బాదల్ హవాకె ఊపర్ హోమస్త్ చారహేహైఁ
ఝడియోంకి మస్తి యోన్సే ధూమేఁ మచాహేహైఁ
పడ్తేహైఁ పానీ హర్ జా జల్ థల్ బనారహేహైఁ
గుల్జార్ భీగ్తేహైఁ సబ్జే నహారహే హైఁ
క్యా క్యా మచీహై యారో బర్సత్ కీ బహారేఁ
మేఘాలు గాలిపై కైపెక్కి వ్యాపిస్తున్నాయి.
జలధారలతో అల్లరిచేస్తున్నాయి.
నీరు ప్రతిచోట పడి జలమయం చేస్తున్నాయి
తోటలు తడుస్తున్నాయి. పచ్చికలు జలకమాడుతున్నాయి.
సఖులారా! వర్షాకాలపు శోభ ఎంత గొప్పగా ఉంది.
మారేఁహైఁ మౌజ్ డాబర్, దర్యా ఉమఁడ్ రహేహైఁ
మోరో పపీహె కోయిల్, క్యాకా ఉమఁడ్ రహేహైఁ
ఝడ్ కర్ రహీహైఁ చిడియాఁ, నాలే ఉమడ్ రహేహైఁ
బర్సేహైఁ మేహ్ ఝడాఝడ్, బాదల్ ఘుమడ్ రహేహైఁ
క్యా క్యా మచీహై యారో బర్సత్ కీ బహారేఁ
మురికినీటి కాలువలు తరగలెత్తుతున్నాయి.
నదులు ఉప్పొంగుతున్నాయి.
నెమళ్ళు, పపీహాలు(పీకహాఁ - అని కూసే పక్షులు)
కోయిలలు గుంపులు కూడుచున్నాయి.
పిచ్చుకలు అరుస్తున్నాయి.
వర్షము ధారాపాతంగా కురుస్తున్నది.
మబ్బులు వ్యాపిస్తున్నాయి.
సఖులారా! వర్షాకాలపు శోభ ఎంత గొప్పగా ఉంది.
No comments:
Post a Comment