కస్తూరీ తిలకం లలాటఫలకే - 2
సాహితీమిత్రులారా!
లీలాశుకుడను నామాంతరముగల
బిల్వమంగళుడు శ్రీకృష్ణకర్ణామృతము అనే
పేరుతో వ్రాయబడిన శ్రీకృష్ణుని లీలామృతమును
మూలభావం చెడకుండా అలాగే ఆంధ్రీకరించిన
వెలగపూడి వెంగన ఆంధ్రీకరణం
ఉదాహరణ చూడండి-
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి
(శ్రీకృష్ణలీలామృతము - 2- 109)
దీనికి వెలగపూడి వెంగనగారి ఆంధ్రీకరణ-
నుదుటం గస్తురి బొట్టు, నాసికతుద న్ముత్తెంబు, శ్రీగంధసం
పద నెమ్మేన, గరంబులం గటకముల్, వంశంబు హస్తాగ్రమం
దెదపై నిస్తుల కౌస్తుభంబు, నఱుతన్ శృంగారహారంబు నిం
పొదవం గృష్ణడు గోపికావృతుడు సర్వోత్కృష్ణుడై వర్ధిలున్
వెలగపూడి వెంగన్న ఆంధ్రీకరణ సుప్రసిద్ధమైన వృత్తాలలో సాగినది.
కానీ మరోఆంధ్రీకరణకర్త పురుషోత్తమకవి 300 శ్లోకాలపై నున్న
వాటిని కేవలం కందపద్యాలలో కూర్చాడు.
ఈ పద్యానికి ఆంధ్రీకరణ చూడండి-
కర,వక్షో,ముఖ, తను, గళ,
వర, నాసల, వేణు, మణి, మృగమదశ్రీగం
ధ, రుచిరహార, వలయ, భా
స్వర మౌక్తికము లెనయు సతి సహితుడు భ్రోచున్
No comments:
Post a Comment