కోరిక దేన్ని హరించివేస్తుంది?
సాహితీమిత్రులారా!
ఒక్కోదానివల్ల ఒక్కొకటి నశించిపోతుంటాయి
అని చెప్పే నీతిశాస్త్రశ్లోకం చూడండి-
జరారూపం హరతి ధైర్య మాశా
మృత్యు: ప్రాణాన్ ధర్మచర్యా మసూయా
క్రోధ: శ్రియం శీల మనార్యనేవా
హ్రియం కామ: సర్వమేవాభిమాన:
లోకంలో ఒక్కొక్క చెడువల్ల ఒక్కొక్క
మంచి కనుమరుగై పోతూఉంటుంది
ఈ దేహానికున్న రూపాన్ని ముసలితనం
ఆక్రమించుకుంటుంది. ధైర్యాన్ని
లోబరుచుకుంటుంది ఆశ.
ప్రాణులను వశం చేసుకుంటుంది మృత్యువు.
ధర్మాచరణ శూన్యతకు అసూయకారణ మవుతూన్నది.
సంపదలను కోపం నాశనం చేస్తోంది. ఇలా
ఒక్కొక్కటి కొన్ని చెడుల వల్ల కనుమరుగైపోతూన్నాయి.
అయోగ్యుల వద్ద కొలువు సత్ప్రవర్తనను దెబ్బతీస్తున్నది.
కోరిక సిగ్గును హరించి వేస్తున్నది. దురభిమానం
సకల సద్గుణాలనూ సంహరించి వేస్తున్నది - అని భావం.
No comments:
Post a Comment