Monday, November 21, 2016

ఒక యేట జిక్కె మీనము


ఒక యేట జిక్కె మీనము




సాహితీమిత్రులారా!


శ్రీకృష్ణునికి 8మంది  భార్యలు
వారిలో భద్రాదేవి ఒకరు.
ఈమె పేరున భద్రాపరిణము అని ఒకరు.
ముకుందవిలాసము అని ఒకరు కావ్యాలను వ్రాశారు.
ముకుందవిలాసమును గద్వాల ఆస్థానకవులలో
ప్రసిద్ధులైన కాణాదం పెద్దన సోమయాజిగారు వ్రాశారు.
అందులో భద్రాదేవిని గురించిన ఈ పద్యం చూడండి-

ఒక యేట జిక్కె మీనము
నొక నెలచే జిక్కె బద్మమొక పగటింటన్
వికలత జిక్కెం గుముదము
సకియ నయన సమంబు లగునె జడగతు లెపుడున్

                                                                            (ముకుందవిలాసము-1-129)

ఇది భద్రాదేవి కన్నులను వర్ణించిన పద్యం-

చేపలు, పద్మాలు, కలువలు ఆమె కనులకు సరికావట.
ఎంచేతనంటే చేపలు ఏటిలో చిక్కేవి(ఏడాదికే కృశిస్తాయి
అని వ్యంగ్యం), పద్మాలు నెలచేత(చంద్రునికి, ఒక నెలకు)
వాడిపోతాయి. కలువలు పగలు (ఒక్కరోజుకే) నశిస్తాయి.
కారణం అవి జడగతులు(జలచరాలు)
భద్రకన్నలు చలనంతో కూడినవి.

ఎంత మనోహర వర్ణన.

No comments:

Post a Comment