Saturday, November 19, 2016

ఏకయా ద్వౌ వినిశ్చిత్య



ఏకయా ద్వౌ వినిశ్చిత్య




సాహితీమిత్రులారా!


మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం కాక 
మరికొందరు ఆంధ్రీకరించారు. 
గద్వాలసంస్థానంనాధీశుడు సోమనాద్రి ఆస్థానంలో
ఉన్న వారు యథాశ్లోకానువాదము వ్రాశారు.
ఒక్కొక్కరు కొన్ని పర్వాలుగా తీసుకొని అనువదించారు. 
వారిలో కొటికెలపూడి వీరరాఘవకవి ఉద్యోగ, భీష్మ,ద్రోణ 
పర్వాలను ఆంధ్రీకరించారు. వీరు అనువదించిన 
విదురనీతిలోని ఒక పద్యాన్ని ఇక్కడ చూద్దాం-


మూలం-

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం చతుర్భి ర్వశే కురు,
సఞ్చ జిత్వా విదిత్వా షట్ సప్త హిత్వా సుఖీభవ
   
                                                             (సంస్కృత మహాభారతము - 5-33-43)

తిక్కన ఆంధ్రీకరణ-

ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి జేర్చి
మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిగి యేడు
విడిచి వర్తించువాడు వివేకధనుడు


కొటికెలపూడి వీరరాఘవకవిగారి ఆంధ్రీకరణ-

బుద్ధి యొక్కటి చేత బుడమి ధర్మాధర్మ
           ములు రెండు నిశ్చయస్ఫూర్తి దెలిసి
తన మిత్ర శాత్ర వోదాసీనులను మువ్వు
           రం దుపాయములు నాల్గందగించి
వారి నందర నాత్మవశుల గావించిన
           యట్లనె యైదింద్రియములు గెల్చి
ప్రఖ్యాతి సంధి విగ్రహములు మొదలుగా
           గల్గిన షడ్గుణంబుల నెఱింగి
వేట జూదంబు వెలదుల కూటమి మధు
పానము నయుక్త దానంబు పరుషదండ
పరుష వచనము లనెడి సప్త వ్యసనము
వెడలి సమధిక సుఖమొందు మీ వధీశ
                                   
                                                       (ఉద్యోగపర్వము 3వ ఆశ్వాసం)


మూలంలోని దానికి తిక్కన వ్రాసినదానికి
ఈ కవిగారు  తాత్పర్య విశదంగా(వ్యాఖ్య)
వ్రాసిన విధంగానే
ఆంధ్రీకరించాడు.

No comments:

Post a Comment